Upcoming Compact SUVs : ఎస్‌యూవీ మార్కెట్‌లో సునామీ.. రాబోయే రెండేళ్లలో విడుదలయ్యే టాప్ మోడల్స్ ఇవే
రాబోయే రెండేళ్లలో విడుదలయ్యే టాప్ మోడల్స్ ఇవే

Upcoming Compact SUVs : భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం సబ్-4 మీటర్ ఎస్‌యూవీలు, కాంపాక్ట్ క్రాస్‌ఓవర్ల హవా నడుస్తోంది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అగ్రగామి సంస్థలన్నీ తమ పాపులర్ మోడళ్లను సరికొత్త హంగులతో ముస్తాబు చేస్తున్నాయి. రాబోయే రెండు మూడేళ్లలో భారత రోడ్లపై సందడి చేయబోయే 7 అత్యంత శక్తివంతమైన కాంపాక్ట్ ఎస్‌యూవీల వివరాలు తెలుసుకుందాం.
1. మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ (2026)
మారుతి సుజుకి తన నంబర్ వన్ ఎస్‌యూవీ బ్రెజ్జాను 2026లో సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో తీసుకురాబోతోంది. ప్రస్తుతం దీని టెస్టింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కొత్త మోడల్‌లో కేవలం డిజైన్ మార్పులే కాకుండా, ఇంజిన్ పరంగా పెద్ద అప్‌డేట్ ఉండబోతోంది. ప్రస్తుతమున్న 1.5 లీటర్ ఇంజిన్‌తో పాటు, ఫ్రాంక్స్ నుంచి సేకరించిన 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ను కూడా ఇందులో చేర్చనున్నారు. ఇది యువతకు పవర్‌ఫుల్ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది.
2. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్
హ్యుందాయ్ తన మైక్రో ఎస్‌యూవీ ఎక్స్టర్ను 2026 మధ్య నాటికి కొత్త లుక్‌లో ప్రవేశపెట్టనుంది. దీని సిగ్నేచర్ బాక్సీ డిజైన్‌ను అలాగే ఉంచుతూనే, ఫ్రంట్ గ్రిల్, ఇంటీరియర్‌లో మార్పులు చేయనున్నారు. లోపల పెద్ద టచ్‌స్క్రీన్, ప్రీమియం అప్‌హోల్స్టరీ వంటి ఫీచర్లు ఉండబోతున్నాయి. ఇంజిన్ పరంగా 1.2 లీటర్ పెట్రోల్, సిఎన్‌జి ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంటుంది.
3. మారుతి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ (2027)
మారుతి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ 2027లో విడుదల కానుంది. ఇందులో అతిపెద్ద మార్పు ఏమిటంటే, కంపెనీ స్వయంగా అభివృద్ధి చేసిన 1.2 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్. ఇది అత్యుత్తమ మైలేజీని అందిస్తుందని అంచనా. అంతేకాకుండా సేఫ్టీ కోసం ఇందులో అడ్వాన్స్‌డ్ అడాస్ (ADAS) ఫీచర్లను కూడా జత చేయనున్నారు.
4. న్యూ జనరేషన్ కియా సోనెట్
కియా సోనెట్ కొత్త తరం మోడల్ కూడా త్వరలో రాబోతోంది. దీని డిజైన్ పూర్తిగా కొత్త సెల్టోస్ నుంచి ప్రేరణ పొంది ఉంటుంది. లోపల, బయట భారీ మార్పులు జరగనున్నాయి. ఫీచర్ల పరంగా కియా ఎప్పుడూ ముందంజలో ఉంటుంది కాబట్టి, ఇందులో మరిన్ని సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లను మనం ఆశించవచ్చు.
5. కొత్త తరం టాటా నెక్సాన్ (ప్రాజెక్ట్ గరుడ)
టాటా మోటార్స్ తన అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీ నెక్సాన్‌ను 2027లో కొత్త జనరేషన్‌లో తీసుకురానుంది. దీనికి అంతర్గతంగా ప్రాజెక్ట్ గరుడ అని పేరు పెట్టారు. ఇది పూర్తిగా కొత్త ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ అడాస్ (ADAS) సిస్టమ్, ఫ్యూచరిస్టిక్ ఇంటీరియర్స్ ఉండబోతున్నట్లు సమాచారం.
6. నెక్స్ట్ జనరేషన్ మహీంద్రా XUV 3XO (2028-29)
మహీంద్రా తన XUV 3XO నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను 2028 చివరలో లేదా 2029 ప్రారంభంలో లాంచ్ చేయనుంది. ఇది మహీంద్రా గతంలో ప్రదర్శించిన విజన్ X కాన్సెప్ట్ ఆధారంగా రూపొందనుంది. ఇది NU_IQ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడుతుంది, ఇది పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్లకు కూడా సపోర్ట్ చేస్తుంది.

