Upcoming Electric Cars:ఇండియన్ ఆటో మార్కెట్లో ఈవీ ధమాకా.. రాబోయే 12 నెలల్లో 6 కొత్త ఎలక్ట్రిక్ కార్ల తుఫాన్
రాబోయే 12 నెలల్లో 6 కొత్త ఎలక్ట్రిక్ కార్ల తుఫాన్

Upcoming Electric Cars: భారత ఆటోమొబైల్ రంగాన్ని ఏలేందుకు ప్రముఖ సంస్థలు సిద్ధమయ్యాయి. రాబోయే 12 నెలల వ్యవధిలోనే టాటా, మారుతి సుజుకి, మహింద్రా, హ్యుందాయ్, ఎమ్‌జి కంపెనీల నుంచి ఏకంగా 6 శక్తివంతమైన కొత్త ఎలక్ట్రిక్ కార్లు భారత రోడ్లపైకి రాబోతున్నాయి.
పోటీకి సై అంటున్న ఎంజీ హెక్టర్, టాటా టిగోర్
భారత మార్కెట్‌లోకి త్వరలోనే అడుగుపెట్టబోతున్న కార్లలో ఎమ్‌జి హెక్టర్ టోమాహాక్ ఈవీ ముందు వరుసలో ఉంది. ఇది 26 ఆగస్టు 2026న విడుదలయ్యే అవకాశం ఉంది. 56.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. మరోవైపు టాటా మోటార్స్ తన ప్రాచుర్యం పొందిన టిగోర్ ఈవి వర్షన్‌ను సరికొత్తగా అప్‌డేట్ చేస్తోంది. ముందు భాగంలో కొత్త బంపర్, ఆకర్షణీయమైన హెడ్‌లైట్లు, సరికొత్త డ్యాష్‌బోర్డ్ హంగులతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇది సిద్ధమవుతోంది.
రోడ్డెక్కనున్న పవర్‌ఫుల్ టాటా సఫారీ ఈవీ
ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో కొత్త సంచలనం సృష్టించేందుకు టాటా సఫారీ ఈవీ సిద్ధమవుతోంది. 3-రో సీటింగ్ ఆప్షన్‌తో రాబోతున్న ఈ కారులో హారియర్ ఈవీ సాంకేతికతను ఉపయోగించారు. లాంగ్ రేంజ్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో లభించే ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 600 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని సమాచారం. దీని రాక మహింద్రా ఎక్స్‌ఇవి 9ఎస్, ఎమ్‌జి టోమాహాక్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
హ్యుందాయ్ కాంపాక్ట్ ఈవీ, మారుతి వైఎమ్‌సి ఎంపీవీ
హ్యుందాయ్ సంస్థ టాటా నెక్సాన్ ఈవికి పోటీగా 'HE1i' కోడ్ నేమ్‌తో ఒక కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని తెస్తోంది. స్థానికంగా తయారైన ఎల్‌ఎఫ్ ప్లాట్‌ఫామ్ బ్యాటరీలతో బాక్సీ డిజైన్‌లో ఈ కారు రానుంది. ఇటు మారుతి సుజుకి కూడా వెనక్కి తగ్గకుండా వైఎమ్‌సి పేరుతో 3-రో ఎలక్ట్రిక్ ఎంపివిని రూపొందిస్తోంది. ఈ విటారా వేదికగా తయారయ్యే ఈ ఎంపివి దాదాపు 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది కియా క్యారెన్స్ క్లావిస్ ఈవికి ప్రతిస్పందనగా మార్కెట్‌లోకి రానుంది.
650 కి.మీ రేంజ్‌తో మహింద్రా బిఇ 07 ఎంట్రీ
మహింద్రా కంపెనీ తమ బోన్ ఈవి శ్రేణిలో 'బిఇ 07' పేరుతో 5 సీటర్ ఎస్‌యూవీని తీసుకొస్తోంది. 4.6 మీటర్ల పొడవుండే ఈ మోడల్ టాటా హారియర్ ఈవితో నేరుగా తలపడనుంది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే దీని బ్యాటరీ సామర్థ్యం ఏకంగా 650 కిలోమీటర్ల రేంజ్ వరకు ఇస్తుందని తెలుస్తోంది. ఇది మహింద్రా లైనప్‌లోనే అత్యధిక రేంజ్ ఇచ్చే కారుగా నిలిచే అవకాశం ఉంది.

