మార్కెట్లోకి నాలుగు భారీ ఎస్‌యూవీల ఎంట్రీ!

Upcoming SUV : కొత్త ఏడాది సరికొత్త జోష్‌తో మొదలైంది. 2026 జనవరి నెల భారతీయ ఆటోమొబైల్ రంగానికి ఒక పండగలా మారబోతోంది. ఈ నెలలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు భారీ ఎస్‌యూవీ మోడళ్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. కియా, మహీంద్రా, మారుతి, రెనాల్ట్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు తమ బెస్ట్ మోడళ్లతో కస్టమర్లను పలకరించనున్నాయి. మరి ఆ నాలుగు ఎస్‌యూవీల ప్రత్యేకతలు, లాంచ్ వివరాలు తెలుసుకుందాం.

1. కొత్త కియా సెల్టోస్ : జనవరి 2 కొత్త సంవత్సరం ప్రారంభంలోనే కియా తన పాపులర్ సెల్టోస్ కొత్త జనరేషన్ మోడల్‌ను విడుదల చేస్తోంది. ఇది పాత దానికంటే పొడవుగా, వెడల్పుగా ఉండటమే కాకుండా, పూర్తిగా కొత్త డిజైన్‌తో రాబోతోంది. పనోరమిక్ డిస్‌ప్లే, 10-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. లెవల్-2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

2. మహీంద్రా XUV 7XO : జనవరి 5 XUV700కి సరికొత్త రూపమే ఈ XUV 7XO. ఇది మహీంద్రా రీబ్రాండింగ్ వ్యూహంలో భాగంగా వస్తోంది. లోపల ఏకంగా మూడు స్క్రీన్ల సెటప్ ఉండబోతోంది. ఇన్-కార్ థియేటర్ మోడ్, 540-డిగ్రీల కెమెరా వంటి హై-టెక్ ఫీచర్లు ఇందులో ఉంటాయి. పాత 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లు కొనసాగుతాయి.

3. మారుతి సుజుకి ఈ-విటారా : జనవరి మధ్యలో మారుతి సుజుకి నుంచి వస్తున్న మొట్టమొదటి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారు ఇది. ఇది 49kWh, 61kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ పైగా రేంజ్ ఇస్తుందని అంచనా. ఇప్పటికే ఈ కారు భారత్ ఎన్‌క్యాప్ (BNCAP) లో 5-స్టార్ రేటింగ్ సాధించి రికార్డు సృష్టించింది.

4. కొత్త రెనాల్ట్ డస్టర్ : జనవరి 26 ఒకప్పుడు కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను ఏలిన డస్టర్.. ఇప్పుడు సరికొత్త రూపంలో రీ-ఎంట్రీ ఇస్తోంది. ఇది మునుపటి కంటే చాలా రగ్గడ్‌గా, వై-షేప్ ఎల్ఈడి లైటింగ్‌తో మాకో లుక్‌లో ఉంటుంది. ఇందులో 1.3 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ ఆప్షన్లు ఉండబోతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story