Sell Your Old Car : ఈ రోజుల్లో కొత్త కారు కొనడం ఎంత సులభమో, పాత కారును మంచి ధరకు అమ్మడం అంత కష్టంగా మారింది. చాలా మంది తమ కారును ఎంతో అపురూపంగా చూసుకున్నప్పటికీ, అమ్మే సమయంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల భారీగా నష్టపోతుంటారు. కొనుగోలుదారుడిని ఆకట్టుకోవాలన్నా, మార్కెట్ ధర కంటే ఎక్కువ డబ్బులు దక్కాలన్నా కొన్ని స్మార్ట్ టిప్స్ పాటించడం చాలా అవసరం. కారు రీసేల్ వాల్యూను పెంచుకోవడానికి మీరు చేయాల్సిన ఆ ముఖ్యమైన పనులు ఇవే.

సర్వీస్ రికార్డులే మీ కారుకు శ్రీరామరక్ష

కారు ఇంజిన్ ఎంత కండిషన్‌లో ఉందనేది కొనుగోలుదారుడికి నమ్మకం కలిగించాలంటే సర్వీస్ హిస్టరీ పక్కాగా ఉండాలి. నిర్ణీత సమయానికి ఇంజిన్ ఆయిల్ మార్చడం, బ్రేక్ చెకప్, టైర్ రొటేషన్ వంటివి చేసినట్లు ఆధారాలు ఉంటే కారు విలువ పెరుగుతుంది. ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లలో చేయించిన బిల్లులు, మెయింటెనెన్స్ డాక్యుమెంట్లు అన్నీ ఒక ఫైల్‌లో భద్రపరచండి. ఇవి మీ కారుపై అవతలి వ్యక్తికి నమ్మకాన్ని కలిగిస్తాయి.

పై మెరుగులకే పడిపోతారు.. క్లీనింగ్ ముఖ్యం

మొదటి చూపులోనే కారు నచ్చాలంటే అది తళతళలాడుతూ ఉండాలి. లోపల సీట్లు శుభ్రంగా లేకపోయినా, కేబిన్ నుంచి దుర్వాసన వచ్చినా ఎంత మంచి కారునైనా ఎవరూ కొనడానికి ఇష్టపడరు. కారును అమ్మే ముందు ఒకసారి ప్రొఫెషనల్ క్లీనింగ్ లేదా పాలిషింగ్ చేయించడం వల్ల కారు కొత్తదానిలా కనిపిస్తుంది. డ్యాష్ బోర్డ్ పైన దుమ్ము లేకుండా చూసుకోవడం, టైర్లకు పాలిష్ వేయడం వంటి చిన్న పనులు వేల రూపాయల అదనపు లాభాన్ని తెచ్చిపెడతాయి.

చిన్న లోపాలను వదిలేయకండి..

చాలా మంది వైపర్ సరిగ్గా పనిచేయకపోయినా, డోర్ దగ్గర చిన్న శబ్దం వస్తున్నా లేదా హెడ్‌లైట్ వెలగకపోయినా అమ్ముతున్నాం కదా ఎందుకులే అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ కొనుగోలుదారుడు టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు ఇలాంటి చిన్న లోపాలు కనిపిస్తే, వారు వేలల్లో బేరమాడుతారు. వందల రూపాయల్లో తీరిపోయే చిన్న చిన్న రిపేర్లను ముందే చేయించుకోవడం వల్ల పెద్ద మొత్తంలో ధర తగ్గకుండా జాగ్రత్తపడవచ్చు.

టెక్నాలజీ, మోడిఫికేషన్స్

కారులో రివర్స్ కెమెరా, బ్లూటూత్ కనెక్టివిటీ, మంచి టచ్ స్క్రీన్ సిస్టమ్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఉంటే కారుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే, అవసరానికి మించి మోడిఫికేషన్లు చేయడం కూడా కొన్నిసార్లు నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే కారును ఎప్పుడు అమ్మాలనేది కూడా ముఖ్యమే. సాధారణంగా పండుగ సీజన్లలో లేదా కారు 3 నుంచి 5 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు అమ్మితే అత్యుత్తమ రీసేల్ వాల్యూ పొందే అవకాశం ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story