VinFast: ఫ్యామిలీ కార్ లవర్స్ కి గుడ్ న్యూస్.. విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ 7 సీటర్ కార్ ధర భారీగా తగ్గింపు
కార్ ధర భారీగా తగ్గింపు

VinFast: మీ ఫ్యామిలీ కోసం బడ్జెట్ ధరలో ఒక ప్రీమియం 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? వియత్నాం దేశానికి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారతీయ వినియోగదారులకు మైండ్ బ్లాంకింగ్ ఆఫర్ ప్రకటించింది. భారతదేశంలో విక్రయిస్తున్న తమ ప్రముఖ 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు VinFast VF MPV 7 ధరను ఏకంగా రూ.4.10 లక్షల మేర తగ్గిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. పండుగల వేళ కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే ఫ్యామిలీలకు ఈ ఆఫర్ మంచి అవకాశం.
కొత్త ధరలు అలాగే అదనపు పండుగ ఆఫర్లు ఇవే
ఇప్పటివరకు భారతీయ మార్కెట్లో విన్ ఫాస్ట్ VF ఎంపీవీ 7 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.24.90 లక్షలుగా అందుబాటులో ఉండేది. కంపెనీ ప్రకటించిన భారీ తగ్గింపు తర్వాత ఈ కారు నూతన ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.20.39 లక్షలకు చేరుకుంది. నవంబర్ 4వ తేదీ నుంచే ఈ కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. ఈ భారీ తగ్గింపుతో పాటు నిబంధనలకు లోబడి కొనుగోలుదారులకు రూ.40,780 విలువైన అదనపు ఫెస్టివ్ బెనిఫిట్స్ లభించనున్నాయి. ఇది ఎక్స్-షోరూమ్ ధర తగ్గింపునకుదనంగా లభించే ప్రత్యేకమైన ఆఫర్ అని కంపెనీ స్పష్టం చేసింది.
పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్ అలాగే 517 కిమీ మైలేజీ
ఈ ఎలక్ట్రిక్ ఎమ్‌పివిలో 60.13 kWh కెపాసిటీ గల పవర్‌ఫుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇందులో అందించిన ఎలక్ట్రిక్ మోటార్ 201 bhp పవర్, 280 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే ARAI ప్రమాణాల ప్రకారం ఏకంగా 517 కిలోమీటర్ల సుదూర ప్రయాణం చేయవచ్చని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఈ కారు సొంతం.
ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం
లాంగ్ డ్రైవ్ వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఈ కారులో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని జోడించారు. 80 kW డిసి ఫాస్ట్ ఛార్జర్ సాయంతో ఛార్జ్ చేసినప్పుడు కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీని 10 శాతం నుండి 70 శాతానికి సులువుగా నింపవచ్చు. కారు గరిష్ట వేగం గంటకు 140 కిలోమీటర్లుగా నమోదైంది. నగరాల్లో రోజువారీ రాకపోకలతో పాటు సుదూర ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు చౌకైన డిసి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల వద్ద స్వల్ప వ్యవధిలోనే ఛార్జింగ్ పూర్తి చేసుకోవచ్చు.
విలాసవంతమైన కేబిన్ స్పేస్, మోడ్రన్ ఫీచర్లు
ఈ విన్‌ఫాస్ట్ కారులో 2+3+2 సిట్టింగ్ లేఅవుట్ ఇచ్చారు. దీనివల్ల మూడు వరుసలలో మొత్తం 7 మంది ప్రయాణికులు అత్యంత సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. 2,840 mm వీల్‌బేస్ ఉండటం వల్ల కాళ్లకు తగినంత స్థలం లభిస్తుంది. ఏడుగురు ప్రయాణిస్తున్నప్పుడు 126 లీటర్ల బూట్ స్పేస్ లభించగా, వెనుక సీట్లను ఫోల్డ్ చేస్తే లగేజ్ కెపాసిటీని ఏకంగా 1,240 లీటర్ల వరకు పెంచుకోవచ్చు. కేబిన్ లోపల 10.1 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, విలాసవంతమైన ఇంటీరియర్స్ ఈ 7 సీటర్ ఎలక్ట్రిక్ కారును పెద్ద కుటుంబాలకు బెస్ట్ ఆప్షన్ గా నిలబెడుతున్నాయి.

