Volkswagen Polo : వోక్స్‌వ్యాగన్ సెన్సేషన్.. అదరగొట్టే లుక్ తో చవకైన కారు
అదరగొట్టే లుక్ తో చవకైన కారు

Volkswagen Polo : వోక్స్‌వ్యాగన్ తన ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ 'పోలో' 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ప్రత్యేకమైన, లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ ముఖ్యంగా జర్మనీ మార్కెట్ కోసం తీసువచ్చింది. దీని ధర దాదాపు 27.88 లక్షల రూపాయలు. దీనిని స్టైల్ ట్రిమ్ రెండవ బేస్ వెర్షన్ ఆధారంగా తయారు చేశారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ 'క్రిస్టల్ బ్లూ మెటాలిక్' రంగులో విడుదల చేసింది. ఇది దీని ఎక్స్టీరియర్ అద్భుతమైన లుక్ో ఇస్తుంది. బీ-పిల్లర్‌పై అమర్చిన 3D '50' లోగో ఇది ఒక స్పెషల్ ఎడిషన్ అని తెలియజేస్తుంది. ఇందులో స్టాండర్డ్ 16 అంగుళాల 'కావెంట్రీ' అల్లాయ్ వీల్స్‌ను అందించారు. అయితే, వినియోగదారులు కావాలంటే 17 అంగుళాల 'టోరోసా' అల్లాయ్ వీల్స్ ఆప్షన్‌ను కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. డార్క్ టింటెడ్ రియర్ విండోలు దీనికి ప్రీమియం లుక్ ఇస్తాయి.
కారు ఇంటీరియర్ కూడా అంతే అద్భుతంగా తీర్చిదిద్దారు. స్పోర్టీ సీట్లతో పాటు, 50 బ్యాడ్జింగ్ స్టీరింగ్ వీల్, డాష్‌బోర్డ్, డోర్ సిల్స్ పై చూడవచ్చు. అంతేకాకుండా, పనోరమిక్ సన్‌రూఫ్ , టూ-జోన్ ఆటోమేటిక్ ఏసీ, యాంబియెంట్ లైటింగ్, బ్లాక్ హెడ్‌లైనర్, క్రోమ్-ఫినిష్ పెడల్స్, హీటెడ్ ఫ్రండట్ సీట్స్, కీ లెస్ ఎంట్రీ, రియర్-వ్యూ కెమెరా వంటి ఫీచర్లు దీనిని మరింత ప్రీమియంగా మారుస్తాయి. మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌ల ఆప్షన్ కూడా లేటెస్ట్ డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
వోక్స్‌వ్యాగన్ ఇందులో 1.0-లీటర్, మూడు-సిలిండర్ టర్బోఛార్జ్డ్ టీఎస్‌ఐ (TSI) పెట్రోల్ ఇంజిన్‌ను ఇచ్చింది. ఇది 95 హెచ్‌పి (hp) పవర్, 175 ఎన్ఎమ్ (Nm) టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. దీని పర్ఫామెన్స్ తో పాటు, ఫ్యూయల్ ఎఫిషియెన్సీ కూడా దీనిని ప్రత్యేకంగా నిలుపుతుంది.
ప్రస్తుతం ఈ మోడల్ జర్మనీలో మాత్రమే అందుబాటులో ఉంది. భారతదేశంలో పోలోకు ఉన్న అభిమానం చూస్తుంటే ఇది భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఫోక్స్‌వ్యాగన్ ప్రస్తుతం భారత మార్కెట్లో 'టైగన్, విర్టస్' వంటి మోడళ్లపై దృష్టి సారించింది. 'టిగ్వాన్ ఆర్-లైన్', 'గోల్ఫ్ జీటీఐ' వంటి ఉత్పత్తులను కూడా తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలో ఎడిషన్ 50 భారతదేశంలోకి వస్తే బ్రాండ్ చరిత్రతో అనుబంధం ఉన్న వారికి ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. వోక్స్‌వ్యాగన్ పోలో ఎడిషన్ 50 భారత మార్కెట్లోకి వస్తే ఇది కారు ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.
