రోడ్ల మీద ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ విధ్వంసం షురూ

Volkswagen Taigun : జర్మన్ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ తన పాపులర్ ఎస్‌యూవీ టైగూన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తాజాగా ఆవిష్కరించింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇస్తున్న టైగూన్, ఇప్పుడు మరింత స్టైలిష్ డిజైన్, హైటెక్ ఫీచర్లు, కొత్త ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో మార్కెట్లోకి వస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఎక్స్‎టీరియర్ చాలా ఆకర్షణీయంగా మారింది. కారు ముందు భాగంలో కొత్త గ్రిల్, దానికి అనుబంధంగా లైట్ బ్యాండ్, వెలుగులు చిమ్మే ఇల్యూమినేటెడ్ లోగోను ఏర్పాటు చేశారు. హెడ్ లైట్ల డిజైన్ ఇప్పుడు ప్రీమియం కారు టిగువాన్ నుంచి స్ఫూర్తి పొందింది. వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్‌తో పాటు వెల్కమ్, గుడ్ బై యానిమేషన్స్ ఇవ్వడం కారుకు రిచ్ లుక్‌ని ఇస్తోంది. కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ కారుకు మరింత స్పోర్టీ అప్పీల్‌ని తెచ్చాయి.

కారు లోపల కంఫర్ట్, టెక్నాలజీకి పెద్దపీట వేశారు. ఇందులో కొత్తగా 10.09 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు, దీని ద్వారా 15 రకాల యాప్‌లను వాడుకోవచ్చు. డ్రైవర్ కోసం 9 అంగుళాల డిజిటల్ క్లస్టర్ ఉంది, ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను చూపిస్తుంది. వాయిస్ అసిస్ట్ సాయంతో ఏసీ, మ్యూజిక్ వంటి ఫంక్షన్లను నియంత్రించవచ్చు. వేసవిలో సౌకర్యవంతంగా ఉండటానికి పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, స్మార్ట్ టచ్ క్లైమేటిక్ ఏసీ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.

భారతీయ వినియోగదారులకు సేఫ్టీ పై భరోసా ఇస్తూ, టైగూన్ ఫేస్‌లిఫ్ట్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్టుల్లో అడల్ట్, చైల్డ్ సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ సాధించింది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), మల్టీ-కొలిజన్ బ్రేక్స్, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి 40కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. రోడ్డుపై ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రయాణికులకు పూర్తి రక్షణ కల్పించేలా దీనిని రూపొందించారు.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, టైగూన్ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రధానంగా రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 114 HP పవర్, 178 Nm టార్క్ ఇస్తుంది. ఇందులో పెద్ద మార్పు ఏంటంటే, పాత 6-స్పీడ్ ఆటోమేటిక్ స్థానంలో ఇప్పుడు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. ఇక మరింత పవర్ కోరుకునే వారి కోసం 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 147 HP పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ (DSG) గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story