మూడేళ్లలోనే రికార్డు క్రియేట్ చేసిన వోక్స్‌వ్యాగన్ వర్టస్

Volkswagen Virtus: వోక్స్‌వ్యాగన్ 'వర్టస్' కారు భారత మార్కెట్‌లో విడుదలై మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి. ప్రీమియం సెడాన్ సెగ్మెంట్లో విడుదలైన ఈ కారు చాలా తక్కువ సమయంలోనే పెద్ద మార్కెట్‌ను సొంతం చేసుకుంది. ఈ కారు 2025లో ఇప్పటివరకు తన విభాగంలో 32 శాతం మార్కెట్ వాటాను సాధించగలిగింది. అంతేకాకుండా, వర్టస్ 2024తో పాటు 2025లో కూడా అత్యధికంగా అమ్ముడైన సెడాన్ కారుగా నిలిచింది. మార్కెట్‌లో ఈ కారు హోండా సిటీ , హ్యుందాయ్ వెర్నా వంటి అనేక పాపులర్ సెడాన్ కార్లకు పోటీ ఇస్తోంది.

వర్టస్ కారు ప్రారంభ ధర షోరూమ్ వద్ద దాదాపు 11.50 లక్షల రూపాయలు. 1.0 టీఎస్‌ఐ మోడల్‌పై 1.65 లక్షల రూపాయల వరకు తగ్గింపు ఉండగా, 1.5 టీఎస్‌ఐ మోడల్‌పై 1.05 లక్షల రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది. వర్టస్ స్పోర్ట్ మోడల్‌లో 1.0 టీఎస్‌ఐ ఆటోమేటిక్ వేరియంట్‌పై 65,000 రూపాయల వరకు లాభాలు ఉండగా, 1.5 టీఎస్‌ఐపై 70,000 రూపాయల వరకు లాభాలు ఉన్నాయి. వీటితో పాటు 50,000 రూపాయల మూడవ వార్షికోత్సవ ఆఫర్, 20,000 రూపాయల వరకు స్క్రాపేజ్ బోనస్ కూడా ఉన్నాయి. వోక్స్‌వ్యాగన్ వర్టస్‌కు హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా వంటి కార్లు పోటీగా ఉన్నాయి.

ఈ కారులో 10 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో పాటు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ , ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రలో, వెంటిలేటెడ్ సీట్లు, పుష్ స్టార్ట్ స్టాప్ బటన్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు (Rain-sensing Wipers), మెరిసే ఫుట్‌వెల్, యాంప్లిఫైయర్-సబ్‌వూఫర్ వంటి 40కి పైగా ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ వర్టస్ డిజైన్, ఇంటీరియర్, సేఫ్టీ కోసం అద్బుతమైన ఫీచర్లు ఉన్నాయి. వోక్స్‌వ్యాగన్ వర్టస్‌లో సేఫ్టీ టెక్నాలజీలు కలిసి ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, మల్టీ కొల్లిజన్ బ్రేక్ వంటివి ఉన్నాయి. హిల్ హోల్డ్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్లతో కూడిన వెనుక కెమెరా , ఐసోఫిక్స్ పిల్లల సీటు యాంకర్లు వంటి యాక్టివ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ వర్టస్ తన సెగ్మెంట్లోనే అత్యంత పొడవైన సెడాన్ కారు (4,561 మిల్లీమీటర్ల పొడవు), 2,651 మిల్లీమీటర్ల వీల్‌బేస్ కలిగి ఉంది. దీనివల్ల వెనుక కూర్చునే వారికి కూడా మంచి లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ లభిస్తుంది. ఎల్‌ఈడి లైట్స్, ట్విన్ పాడ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 521 లీటర్ల బూట్ స్పేస్ వంటివి ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story