దీని స్పెషాలిటీ ఇదే

Volkswagen Virtus : భారతీయ మార్కెట్‌లో ఫోక్స్‌వ్యాగన్ కార్లకు మంచి పేరు ఉంది. అయితే, గత నెల అంటే జూలై 2025 లో కంపెనీ విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ కారు అందరినీ ఆశ్చర్యపరిచేలా టాప్ పొజిషన్‌ను సాధించింది. ఈ కారు కంపెనీలోని ఇతర మోడల్‌లన్నింటినీ వెనక్కి నెట్టేసి నెంబర్ 1 స్థానంలో నిలిచింది. కేవలం వర్టస్ అమ్మకాలు మాత్రమే పెరగడం వెనక ఉన్న కారణాలు, దాని అద్భుతమైన ఫీచర్లు, కంపెనీలోని ఇతర మోడల్‌ల అమ్మకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గత నెలలో ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ అమ్మకాల్లో 2 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. జూలై 2025లో ఈ కారు మొత్తం 1,797 యూనిట్లు అమ్ముడయ్యాయి. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం అంటే జూలై 2024లో ఈ సంఖ్య 1,766 యూనిట్లు మాత్రమే. ఈ గణాంకాలు వర్టస్‌కు ప్రజలలో ఎంత ఆదరణ ఉందో స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా యువత ఈ కారు స్టైలిష్ డిజైన్ అడ్వాన్సుడ్ ఫీచర్లకు బాగా ఆకర్షితులయ్యారు.

వర్టస్ తర్వాత అమ్మకాల జాబితాలో రెండో స్థానంలో ఫోక్స్‌వ్యాగన్ టైగున్ ఉంది. ఈ కారు అమ్మకాల్లో 15 శాతం వార్షిక క్షీణత కనిపించింది.. మొత్తం 1,327 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇక మూడో స్థానంలో ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ నిలిచింది, ఇది మొత్తం 60 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. జాబితాలో చివరి స్థానంలో ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఉంది. టిగువాన్ అమ్మకాల్లో 64 శాతం భారీ క్షీణత నమోదైంది, కేవలం 28 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ అత్యుత్తమ అమ్మకాలను నమోదు చేయడానికి దాని అడ్వాన్సుడ్ ఫీచర్లే ప్రధాన కారణం. ఇందులో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయానికొస్తే, ఈ కారు 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్, రియర్‌వ్యూ కెమెరాతో వస్తుంది. ఈ ఫీచర్లు డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగ్గా, సురక్షితంగా చేస్తాయి.

వర్టస్ కారు రెండు ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. మొదటిది 1.0-లీటర్ టీఎస్‌ఐ టర్బో ఇంజిన్, ఇది 115బీహెచ్‌పీ పవర్‌ను, 178ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. రెండవది 1.5-లీటర్ టీఎస్‌ఐ టర్బో ఇంజిన్, ఇది 150బీహెచ్‌పీ పవర్, 250ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 7-స్పీడ్ డీఎస్‌జీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేయబడింది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.11.56 లక్షల నుండి రూ.19.40 లక్షల వరకు ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story