ఏఐ తో నడిచే ప్రపంచపు మొదటి కారు

Volvo EX60 : వోల్వో కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహన లైనప్‌లో సరికొత్త సంచలనానికి సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Volvo EX60 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 2026, జనవరి 21న అధికారికంగా గ్లోబల్ డెబ్యూ చేయబోతోంది. కేవలం ఒక కారుగానే కాకుండా ఒక స్మార్ట్ రోబోలా వ్యవహరించే ఈ వాహనం ఆటోమొబైల్ రంగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పబోతోంది. వోల్వో EX60 కేవలం పవర్‌ఫుల్ మాత్రమే కాదు, చాలా తెలివైన కారు కూడా. ఈ వాహనంలో గూగుల్ సరికొత్త Gemini AI అసిస్టెంట్‌ను ఇన్-బిల్ట్‌గా ఇచ్చారు. ఇది సాధారణ వాయిస్ కమాండ్స్ లాగా కాకుండా, మనిషితో మాట్లాడినట్లుగా సహజంగా సంభాషిస్తుంది. భవిష్యత్తులో ఈ AI కారు చుట్టూ ఉన్న కెమెరాల ద్వారా చూడగలదు కూడా. అంటే, మీరు కారును "ముందు కనిపిస్తున్న ఆ హోటల్ పేరు ఏంటి?" అని అడిగితే, అది కెమెరా ద్వారా చూసి సమాధానం చెబుతుంది. ఇది డ్రైవర్‌కు అత్యంత సురక్షితమైన మరియు సులభమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

ఈ కారు పర్ఫార్మెన్స్ గణాంకాలు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. వోల్వో EX60 ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 810 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఇది వోల్వో చరిత్రలోనే అత్యధిక రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ కార్. అంతేకాదు ఇందులో ఉన్న 800-వోల్ట్ ఆర్కిటెక్చర్ వల్ల 400kW అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కేవలం ఒక కాఫీ తాగే సమయంలో (అంటే 10 నిమిషాల్లో) ఏకంగా 340 కిలోమీటర్ల ప్రయాణానికి సరిపడా బ్యాటరీని నింపుకోవచ్చు.

వోల్వో తన కొత్త SPA3 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన మొదటి కారు ఇదే. బ్యాటరీని నేరుగా కారు బాడీలో భాగంగా అమర్చడం వల్ల బరువు తగ్గి మైలేజీ పెరిగింది. భద్రతలో ఎప్పుడూ నంబర్ వన్ గా ఉండే వోల్వో, ఇందులో హగ్గిన్‌కోర్ అనే అడ్వాన్స్‌డ్ సెన్సార్ సిస్టమ్, ఎన్విడియా కంప్యూటింగ్ పవర్‌ను ఉపయోగించింది. దీనివల్ల కారు సెకనుకు 250 ట్రిలియన్ల ఆపరేషన్లు చేస్తూ చుట్టుపక్కల ప్రమాదాలను పసిగట్టి డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story