వాగన్ ఆర్ సేఫ్టీ రేటింగ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Maruti WagonR :మారుతి సుజుకి వాగన్ ఆర్ గురించి మన దేశంలో తెలియని వారుండరు. మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక ఆల్-టైమ్ ఫేవరెట్ కారు. ధర తక్కువ, మైలేజీ ఎక్కువ, లోపల స్పేస్ అదిరిపోతుంది.. అందుకే ఈ కారు దశాబ్దాలుగా హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. అయితే, అమ్మకాల్లో రారాజుగా ఉన్న ఈ టాల్ బాయ్ హ్యాచ్‌బ్యాక్,సేఫ్టీ విషయంలో మాత్రం దారుణంగా వెనుకబడి ఉంది. తాజాగా వస్తున్న నివేదికలు ఈ కారు భద్రతా ప్రమాణాలపై ఆందోళన కలిగిస్తున్నాయి.

సేఫ్టీ సంగతి పక్కన పెడితే, వాగన్ ఆర్ అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. నవంబర్ 2025లో ఈ కారు ఏకంగా 14,619 యూనిట్లు అమ్ముడైంది. గతేడాది నవంబర్ (13,982 యూనిట్లు)తో పోలిస్తే ఇది 4.56 శాతం వృద్ధి. మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికీ ఇది అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటిగా కొనసాగుతోంది. సామాన్యుడి బడ్జెట్‌కు అందుబాటులో ఉండటమే దీనికి ప్రధాన కారణం.

వాగన్ ఆర్ ఎంత పాపులర్ కారు అయినా, క్రాష్ టెస్ట్ ఫలితాలు మాత్రం నిరాశాజనకంగా ఉన్నాయి. 2023లో నిర్వహించిన గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారుకు అడల్ట్ సేఫ్టీ(పెద్దల భద్రత)లో కేవలం 1 స్టార్ మాత్రమే లభించింది. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే.. చైల్డ్ సేఫ్టీ (పిల్లల భద్రత)లో ఈ కారుకు సున్నా స్టార్ రేటింగ్ వచ్చింది. కారు బాడీ షెల్, ఫుట్‌వెల్ ప్రాంతం అస్థిరంగా ఉన్నాయని, ప్రమాదం జరిగినప్పుడు ఇవి ఎక్కువ ఒత్తిడిని తట్టుకోలేవని టెస్టింగ్ ఏజెన్సీ తేల్చి చెప్పింది.

ప్రస్తుతం భారత మార్కెట్లో వాగన్ ఆర్ బేస్ మోడల్ ధర రూ.4,98,900 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ వేరియంట్ రూ.6,94,900 వరకు ఉంది. ఇది ప్రధానంగా టాటా టియాగో, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ వంటి కార్లతో పోటీ పడుతోంది. అయితే, సేఫ్టీ విషయంలో టాటా టియాగో (4 స్టార్ రేటింగ్) వాగన్ ఆర్ కంటే చాలా మెరుగ్గా ఉండటం గమనార్హం.

PolitEnt Media

PolitEnt Media

Next Story