మార్కెట్లోకి వచ్చిన టాప్ 5 కార్లు ఇవే!

New Car Launches : భారతీయ ఆటోమొబైల్ రంగం ఈ వారం కొత్త వాహనాల రాకతో కళకళలాడుతోంది. లగ్జరీ ఎస్‌యూవీల నుంచి మధ్యతరగతికి అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ కార్ల వరకు.. మార్కెట్లోకి రకరకాల మోడల్స్ వచ్చి చేరాయి. మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వారం లాంచ్ అయిన టాప్ కార్ల వివరాలు, వాటి ఫీచర్లు, ధరలపై ఓ లుక్కేయండి.

1. బిఎమ్‌డబ్ల్యూ X3 30 xDrive M స్పోర్ట్ ప్రో

లగ్జరీ కార్ల దిగ్గజం బిఎమ్‌డబ్ల్యూ ఫిబ్రవరి 16న తన X3 30 xDrive M స్పోర్ట్ ప్రో మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.74.5 లక్షలు. ఇందులో 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని అమర్చారు. ఇది 258 bhp పవర్, 400 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వేగం, సౌకర్యాన్ని కోరుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ లగ్జరీ ఎస్‌యూవీ.

2. మారుతి సుజుకి ఈ విటారా

మారుతి సుజుకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఈ విటారాను లాంచ్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. దీని ప్రారంభ ధర రూ.10.99 లక్షలు. ఇందులో 48.8 kWh, 61.1 kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది ఏకంగా 440 కి.మీ నుంచి 543 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' మోడల్ ద్వారా కూడా ఇది అందుబాటులో ఉండటం విశేషం. కేవలం నెక్సా షోరూమ్‌ల ద్వారానే దీని విక్రయాలు జరుగుతాయి.

3. నిస్సాన్ గ్రావిటీ బి ఎంపీవీ

ఏడుగురు ప్రయాణించే వీలున్న నిస్సాన్ గ్రావిటీ కేవలం రూ.5.65 లక్షలకే అందుబాటులోకి వచ్చింది. ప్రారంభంలో 1,001 యూనిట్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుంది. ఇందులో 1.0 లీటర్ ఇంజిన్ ఉంది. 8-ఇంచ్ టచ్‌స్క్రీన్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి 45కు పైగా సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అతి తక్కువ బడ్జెట్‌లో పెద్ద ఫ్యామిలీ కోసం కారు కావాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన వరం.

4. వోక్స్ వ్యాగన్ టెరాన్ ఆర్-లైన్

వోక్స్ వ్యాగన్ ఇండియా ఫిబ్రవరి 18న టెరాన్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఇందులో 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ అమర్చారు, ఇది 204 HP పవర్ ఇస్తుంది. 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు సమానంగా అందుతుంది. స్టైలిష్ లుక్, అత్యున్నత భద్రత దీని ప్రత్యేకత.

5. టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్

టాటా మోటార్స్ తన ఫేవరెట్ పంచ్ ఈవీని సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఫిబ్రవరి 20న లాంచ్ చేయనుంది. 2023 తర్వాత దీనికి జరుగుతున్న మొదటి మేజర్ అప్‌డేట్ ఇది. కొత్త రంగులు, మెరుగైన డిజైన్ మార్పులతో ఇది రాబోతోంది. విడుదల రోజే బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story