మారుతి గ్రాండ్ విటారా కొనాలంటే ఎంత జీతం ఉండాలి?

Maruti Grand Vitara : భారత మార్కెట్‌లో మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్‎ను ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. ఈ కారు అద్భుతమైన మైలేజ్, ఆకర్షణీయమైన డిజైన్ కారణంగా పాపులర్ అయింది. మారుతి గ్రాండ్ విటారా తన సెగ్మెంట్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలలో ఒకటి. మీరు కూడా గ్రాండ్ విటారా హైబ్రిడ్ కొనాలని ఆలోచిస్తుంటే, దాని ఆన్-రోడ్ ధర, ఫైనాన్స్ వివరాలు తెలుసుకుందాం. మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.16.99 లక్షలు(ఎక్స్-షోరూమ్). అయితే, మీరు ఈ కారును కొనుగోలు చేస్తే, ఆన్-రోడ్ ధర దాదాపు 19.36 లక్షల రూపాయలు అవుతుంది. ఇందులో ఆర్‌టీఓ ఛార్జీలు, ఇన్సూరెన్స్, ఇతర ఖర్చులు ఉంటాయి.

మారుతి గ్రాండ్ విటారా డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఫైనాన్స్ చేయించుకోవాలని అనుకుంటే.. మీరు రూ.4.36 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఆ తర్వాత మిగిలిన 15 లక్షల రూపాయలకు బ్యాంక్ నుంచి కార్ లోన్ తీసుకోవాలి. మీరు ఈ లోన్‌ను 9 శాతం వడ్డీ రేటుతో 7 సంవత్సరాలకు తీసుకుంటే, ప్రతి నెలా 25 వేల రూపాయల ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు మారుతి గ్రాండ్ విటారా మరింత సురక్షితంగా మారింది. కంపెనీ ఇప్పుడు అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తోంది. మీ నెల జీతం 60 వేల నుంచి 70 వేల రూపాయలు ఉంటే, మీరు ఈఎంఐని సులభంగా చెల్లించవచ్చు.

మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్ ఎస్‌యూవీలో అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. డ్రైవింగ్‌ను సురక్షితం చేయడానికి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంది. ఏబీఎస్, ఈబీడీతో పాటు, మెరుగైన బ్రేకింగ్ కోసం ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు ఇచ్చారు. పిల్లల భద్రత కోసం ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కారు పెద్ద ప్రత్యేకత ఏంటంటే మీరు స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్‌ను కొనుగోలు చేస్తే, ఇందులో 45 లీటర్ల ట్యాంక్ ఉంటుంది. ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే సులభంగా 1200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story