Yamaha R2: యువత కలల బైక్ యమహా R2 వచ్చేస్తోంది..200cc పవర్‌ఫుల్ ఇంజిన్, అదుర్స్ అనిపించే ఫీచర్లు
అదుర్స్ అనిపించే ఫీచర్లు

Yamaha R2: ద్విచక్ర వాహన ప్రియులను అలరించేందుకు ప్రముఖ కార్లు, బైకుల తయారీ సంస్థ యమహా భారత్‌లో ఒక కొత్త ఫేర్డ్ స్పోర్ట్స్ బైక్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ వారంలోనే అంటే ఆగస్టు 27, 2026 నాటికి కంపెనీ తన యమహా ఆర్2 బైక్‌ను అధికారికంగా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. యువతను విశేషంగా ఆకట్టుకునే రేసింగ్ లుక్,శక్తివంతమైన పెర్ఫార్మెన్స్‌తో ఈ బైక్‌ను డిజైన్ చేశారు.
200cc పవర్‌ఫుల్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్
ఈ కొత్త యమహా R2 మోటార్ సైకిల్‌లో 200 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ శక్తివంతమైన ఇంజిన్ గరిష్టంగా 25 హార్స్‌పవర్ (hp) శక్తిని, 19 న్యూటన్ మీటర్ల (Nm) టాక్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, స్మూత్ గేర్ షిఫ్టింగ్, మెరుగైన మైలేజ్ కోసం ఇందులో 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను జతచేశారు. ఫుల్ ఫేర్డ్ ఏరోడైనమిక్ డిజైన్‌తో రానున్న ఈ బైక్, రైడింగ్ సమయంలో బైకర్‌కు అద్భుతమైన స్పోర్టీ అనుభూతిని అందిస్తుంది.
అధునాతన ఫీచర్లు, రైడింగ్ సెటప్:
యమహా R2 మోడల్‌లో ఆధునిక ఫీచర్లకు కొదవలేకుండా ఉండేలా చూసుకున్నారు. బైక్ ముందు భాగంలో స్టైలిష్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ ఇండికేటర్లు, వెనుక ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ లభిస్తాయి. మెరుగైన భద్రత కోసం డ్యూయల్ డిస్క్ బ్రేకులతో పాటు ఆంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ముందు వైపు USD ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రేసింగ్ ప్రేరిత క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్ మరియు స్ప్లిట్ సీట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ప్రస్తుతానికి ఈ బైక్ ధర గురించిన వివరాలను సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే లాంచ్ సమయంలోనే దీని ధరను సస్పెన్స్‌గా వెల్లడించనున్నారు. భారత మార్కెట్‌లో ఇది విడుదలయితే కేటీఆర్ డుయో KTM Duke 200, KTM RC 200, బజాజ్ సొంత స్పోర్ట్స్ మోడల్ Bajaj Pulsar RS 200 బైక్‌లకు ప్రత్యక్ష పోటీదారుగా నిలవనుంది.

