Honda Amaze : కొత్త కారు కొనాలంటే ఇదే సరైన సమయం..హోండా అమేజ్‌పై రూ.98,000 ఆదా
హోండా అమేజ్‌పై రూ.98,000 ఆదా

Honda Amaze : హోండా కార్స్ ఇండియా కూడా డిసెంబర్ 2025 నెల కోసం సంవత్సరాంతపు ఆఫర్‌లను ప్రకటించింది. ఈ తగ్గింపులు హోండా అన్ని ప్రయాణీకుల వాహనాల శ్రేణిపై ఈ డిసెంబర్ నెల మొత్తం అందుబాటులో ఉంటాయి. హోండా ప్రస్తుతం భారత్‌లో 5 మోడళ్లను విక్రయిస్తోంది. వీటిలో సెకండ్ జనరేషన్ అమేజ్, థర్డ్ జనరేషన్ అమేజ్, సిటీ, సిటీ హైబ్రిడ్, ఎలివేట్ మోడల్స్ ఉన్నాయి. అయితే ఈ ఆఫర్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ అయిన హోండా అమేజ్ పై గణనీయమైన తగ్గింపు లభిస్తోంది. ఈ తగ్గింపు మొత్తం మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటుంది. డీలర్ స్థాయి స్టాక్ లభ్యతపై కూడా ఆధారపడి ఉంటుంది.
సెకండ్ జనరేషన్ హోండా అమేజ్ సెడాన్ మోడల్‌ను కంపెనీ ఇప్పటికీ విక్రయిస్తోంది. దీనిపై రూ.98,000 వరకు ఇయర్ ఎండ్ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ పాత జనరేషన్ మోడల్ కేవలం బేస్ వేరియంట్ S లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.5.99 లక్షలు. అదే విధంగా థర్డ్ జనరేషన్ హోండా అమేజ్ పై కూడా ఆకర్షణీయమైన తగ్గింపులు లభిస్తున్నాయి. ఈ కొత్త జనరేషన్ అమేజ్ కొనుగోలుపై వినియోగదారులు రూ.87,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు.
థర్డ్ జనరేషన్ హోండా అమేజ్ V, VX, ZX అనే మూడు ట్రిమ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.40 లక్షల నుంచి రూ.9.21 లక్షల మధ్య ఉంది. ఈ సబ్-కాంపాక్ట్ సెడాన్ మార్కెట్లో మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఔరా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. సాధారణంగా ఏడాది చివరిలో కంపెనీలు పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి ఇలాంటి భారీ తగ్గింపులను ప్రకటిస్తాయి. కాబట్టి ఈ డిసెంబర్‌లో హోండా కారు కొనుగోలు చేయాలని, ముఖ్యంగా రూ. లక్ష వరకు తగ్గింపు ప్రయోజనాన్ని పొందాలనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం.

