Year End Offers : షోరూంల దగ్గర పాత స్టాక్ క్లియరెన్స్ మేళా..రూ.2.50 లక్షల తగ్గింపుతో టాటా, మహీంద్రా కార్ల విధ్వంసం
రూ.2.50 లక్షల తగ్గింపుతో టాటా, మహీంద్రా కార్ల విధ్వంసం

Year End Offers : కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది అదిరిపోయే సమయం. 2025 ఏడాది ముగింపుకు వస్తుండటంతో పాటు, 2026లో సరికొత్త మోడళ్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. దీంతో కార్ల కంపెనీలు తమ పాత స్టాక్‌ను వదిలించుకోవడానికి భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పాపులర్ ఎస్‌యూవీలపై ఏకంగా రూ.2.50 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ కార్ల కోసం మీరు నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం కూడా లేదు. ఆ 4 అదిరిపోయే ఎస్‌యూవీలు ఏవి? వాటిపై ఆఫర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
1. స్కోడా కుషాక్
స్కోడా కుషాక్ తన స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ ఇంజిన్‌కు పేరుగాంచింది. దీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ జనవరి 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతం ఉన్న మోడల్‌పై కంపెనీ భారీ ఆఫర్లు ఇస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం, కుషాక్‌పై దాదాపు రూ.2.50 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. అయితే స్కోడా అధికారికంగా మాత్రం రూ.3.25 లక్షల వరకు ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంటోంది (ఇందులో కార్పొరేట్, స్క్రాపేజ్ ఆఫర్లు కలిపి ఉండవచ్చు). ప్రస్తుతం దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.10.61 లక్షల నుంచి రూ.18.43 లక్షల మధ్య ఉంది.
2. కియా సెల్టోస్
కియా కంపెనీ తన నెక్స్ట్ జనరేషన్ సెల్టోస్‌ను 2026లో తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో పాత మోడల్‌ను త్వరగా క్లియర్ చేసేందుకు రూ.1.60 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా కలిసి ఉంది. సెల్టోస్ కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న వారికి ఇది మంచి ఛాన్స్. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూ.10.79 లక్షల నుంచి రూ.19.81 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
3. మహీంద్రా XUV700
మహీంద్రా తన పాపులర్ ఎస్‌యూవీ XUV700 ఫేస్‌లిఫ్ట్‌ను టీజ్ చేసింది. దీనికి XUV 7XO అనే కొత్త పేరు పెట్టి జనవరి 5, 2026న గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. కొత్త మోడల్ రాకముందే డీలర్ల వద్ద ఉన్న XUV700 స్టాక్‌పై సుమారు రూ.80,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. కొన్ని చోట్ల ఈ తగ్గింపు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.13.66 లక్షల నుంచి రూ.23.71 లక్షల మధ్య ఉంది.
4. టాటా పంచ్
చిన్న కార్లలో సంచలనం సృష్టించిన టాటా పంచ్ కూడా కొత్త వెర్షన్‌లో రాబోతోంది. 2026లో దీని ఫేస్‌లిఫ్ట్ మోడల్ విడుదల కానుంది. ప్రస్తుతం ఉన్న పంచ్ మోడల్‌పై దాదాపు ₹80,000 వరకు తగ్గింపును ఆఫర్ చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన ఈ మైక్రో ఎస్‌యూవీ ప్రస్తుత ధర రూ.5.50 లక్షల నుంచి రూ.9.30 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. తక్కువ బడ్జెట్‌లో మంచి సేఫ్టీ కారు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్.

