మొబైల్ ఫోన్ కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్

Zelio Electric : ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో భారత మార్కెట్లోకి కొత్తకొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన నైట్+ను జెలియో ఎలక్ట్రిక్ అనే స్టార్టప్ లాంచ్ చేసింది. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ కావాలనుకునే వారికి ఈ స్కూటర్ ఒక మంచి ఆప్షన్. జెలియో ఎలక్ట్రిక్ తమ కొత్త నైట్+ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.59,990 (ఎక్స్-షోరూమ్) ధరతో భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇప్పటివరకు మీడియం రేంజ్, ఖరీదైన స్కూటర్లలో మాత్రమే కనిపించిన స్మార్ట్ ఫీచర్లు ఈ బడ్జెట్ స్కూటర్‌లో అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో మంచి పనితీరు, ఫీచర్లను కోరుకునేవారిని దృష్టిలో ఉంచుకొని ఈ స్కూటర్‌ను రూపొందించారు.

నైట్+ స్కూటర్ చాలా ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. హిల్ హోల్డ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ , ఫాలో-మి-హోమ్ హెడ్‌ల్యాంప్స్ , USB ఛార్జింగ్ పోర్ట్, రిమూవబుల్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్‌లో 1.8kWh రిమూవబుల్ LFP బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 100 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట వేగం గంటకు 55 కి.మీ. ఈ స్కూటర్ బుకింగ్‌లు దేశవ్యాప్తంగా ఉన్న జెలియో ఎలక్ట్రిక్ డీలర్‌షిప్‌లలో ఇప్పటికే మొదలయ్యాయి. స్కూటర్ డెలివరీలు ఆగస్టు 20, 2025 నుంచి ప్రారంభమవుతాయి.

నైట్+ స్కూటర్ మొత్తం 6 రంగులలో అందుబాటులో ఉంది. గ్లోసీ వైట్, గ్లోసీ బ్లాక్ వంటి సింగిల్ టోన్ రంగుల్లోనూ, మ్యాట్ బ్లూ & వైట్, మ్యాట్ రెడ్ & వైట్, మ్యాట్ యెల్లో & వైట్, మ్యాట్ గ్రే & వైట్ వంటి డ్యూయల్ టోన్ రంగుల్లో లభిస్తుంది. జెలియో ఎలక్ట్రిక్ సహ-వ్యవస్థాపకుడు ముకుంద్ బహేతీ మాట్లాడుతూ.. "నైట్+ అనేది ఒక స్కూటర్ మాత్రమే కాదు. తక్కువ ధరలో మంచి ఫీచర్లున్న ఎలక్ట్రిక్ వాహనాలను అందరికీ అందించాలనే మా లక్ష్యంలో ఇది ఒక భాగం. రూ.59,990 ధరతో, ఇది దాని సెగ్మెంట్‌లో అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్" అని చెప్పారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story