10 మంది మృతి

Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, వరంగల్ జిల్లా ఘన్‌పూర్‌కు చెందిన మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణతో సహా 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మనోజ్‌పై గతంలో రూ.2 కోట్ల రివార్డు ఉంది. మృతుల్లో ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్ యారఫ్ పాండు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరు కీలక నేతలు కూడా చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ ఎన్‌కౌంటర్ ముగిసిన తర్వాత మృతుల వివరాలపై పూర్తి స్పష్టత రానుందని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో గరియాబంద్ ఈ30, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్), కోబ్రా జవాన్లు పాల్గొన్నారు. గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా ఈ ఎన్‌కౌంటర్‌ను పర్యవేక్షించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story