✕
నేటి రాత్రికి ఢిల్లీ కి సిఎం చంద్రబాబు నాయుడు
By Politent News Web 1Published on 22 May 2025 5:27 PM IST
రేపు 7మంది కేంద్ర మంత్రులతో భేటీ

x
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి రాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా 23వ తేదీ 7 గురు కేంద్ర మంత్రులతో సిఎం సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై మంత్రులతో చర్చించి సహకారం కోరనున్నారు. ఢిల్లీ భేటీలో సిఎం చంద్రబాబు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్ జోషి, అశ్వినీ వైష్ణవ్, సిఆర్ పాటిల్, జితేంద్ర సింగ్ లతో భేటీ కానున్నారు. ఢిఫెన్స్ పరిశ్రమలు, స్పేస్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమలు, పోలవరం బనకచర్లకు కేంద్ర సాయం, ప్రతి ఇంటికీ తాగునీరు, రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, తదితర అంశాలపై సిఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో ప్రధానంగా చర్చించనున్నారు.

Politent News Web 1
Next Story