నగరంలో జోరుగా వర్షం!

Hyderabad: రాజధాని హైదరాబాద్ నగరవ్యాప్తంగా క్యూమిలో నింబస్ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో నగరంలో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి తేలికపాటి జల్లులు మొదలై, అవి క్రమంగా జోరువానగా మారాయి. రాబోయే రెండు నుంచి మూడు గంటల పాటు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు, కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

బేగంపేట, సికింద్రాబాద్ పరిసరాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌లోనూ జోరువాన కనిపిస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, మణికొండ, గచ్చీబౌలి, హైటెక్ సిటీ, నానక్ రామ్ గూడ, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, బోరబండ, యూసఫ్‌గూడ, సనత్‌నగర్, మూసాపేట్, కూకట్‌పల్లి, కేబీహెచ్‌బీ, మియాపూర్‌లో కూడా జడివాన కురుస్తోంది.

వర్షం కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ పొంగి, రోడ్లపై నీరు చేరుతోంది. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, డీఆర్ఎఫ్, ట్రాఫిక్ సిబ్బందిని భారత వాతావరణ శాఖ (IMD) అప్రమత్తం చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story