Flight traffic disrupted in Shamshabad

తెలంగాణ గ్రామీణ ప్రాంతాలతోపాటు హైదరాబాద్ లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి పడుతున్న కుండపోత వర్షానికి హైదరాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి నుంచి ప్ర‌తికూల వాతావ‌ర‌ణం కార‌ణంగా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాల ల్యాండింగ్‌కు అధికారులు అనుమ‌తివ్వ‌లేదు. దీంతో కొన్ని విమానాలు బెంగ‌ళూరు, విజ‌య‌వాడ వైపు మ‌ళ్లించారు. ల‌క్నో, కోల్‌క‌తా, ముంబై, జైపూర్ నుంచి వ‌చ్చే విమానాల‌ను బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు మ‌ళ్లించారు. బెంగ‌ళూరు నుంచి హైద‌రాబాద్ వ‌చ్చే విమానాలను విజ‌య‌వాడ‌కు మ‌ళ్లించారు. ఈరోజు (బుధ‌వారం) ఉద‌యం నాటికి వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉండ‌డంతో.. విమానాలు య‌థావిధిగా కొన‌సాగుతున్నాయ‌ని శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.

Politent News Web3

Politent News Web3

Next Story