Miss England Milla Magee makes allegations against Miss World competition being held in Hyderabad

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలపై ఊహించని ఆరోపణలు వచ్చాయి. మిస్ వరల్డ్ నిర్వహణపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ సంచలన వ్యాఖ్యలు చేసింది. పోటీలు సక్రమంగా జరగడం లేదని... అందం పేరుతో అంగాలను ప్రదర్శించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంగ్లాండ్ కి చెందిన సన్ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ (Miss England Milla Magee) భారత్లో జరుగుతున్న అందాల పోటీల్లో పోటీదారులను వేశ్యల్లా(prostitute) చూస్తున్నారని ఆరోపించింది.

పోటీలు నిర్వహిస్తున్న కమిటీలో కీలక అధికారులు…వారికి సన్నిహితులైన కొందరు బడాబాబులు అందగత్తెల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని తెలిపింది. కొందరు బడాబాబులు అందగత్తెలను ఆటవస్తువుల్లా వాడుకోవాలని చూస్తున్నారని మండిపడింది.

ప్రపంచ సుందరి పోటీల చరిత్రలో బహుశ ఇలా జరగటం మొదటిసారి కావొచ్చని మిల్లా వ్యాఖ్యానించింది.

మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ పోటీల నుంచి అర్దాంతరంగా వెళ్లిపోయింది. అనారోగ్యంగా ఉండటం వల్లే వెళ్లిపోయిందని నిర్వాహకులు వెల్లడించారు. సన్ మ్యాగజైన్ ఇంటర్వూతో తాజా వ్యవహారం బయటపడింది. . ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే కొందరు బడాబాబుల కుమారులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని సన్ మ్యాగ్జైన్ లో పేర్కొన్నారు.

ప్రపంచ సుందరి పోటీల నిర్వాహకుల నుంచి వివరణ వస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పోటీల నిర్వహణ నుంచి ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ ను తప్పించి…సీనియర్ ఐఎఎస్ అధికారి జయేష్ రంజన్కు అప్పగించారు. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుండగా ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.

Updated On 24 May 2025 4:17 PM IST
Politent News Web3

Politent News Web3

Next Story