జాబితా చూసి ప్లాన్ చేసుకోండి

Bank Holidays : వచ్చే నెల జూలైలో బ్యాంక్ సేవలు మొత్తం 13 రోజుల పాటు నిలిచిపోనున్నాయి. పండుగలు, ఆదివారాలు, అలాగే ప్రతి నెలా ఉండే రెండో, నాలుగో శనివారాలు కలిపి ఈ సెలవులు వస్తున్నాయి. అయితే, ఈ సెలవులు వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు రోజుల్లో ఉంటాయి. కాబట్టి, బ్యాంకుకు వెళ్లే ముందు సెలవుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా ప్లాన్ చేసుకోకపోతే ముఖ్యమైన పనులు ఆగిపోయే అవకాశం ఉంది. బ్యాంకులకు సెలవు ఉన్నంత మాత్రాన మీ పనులన్నీ ఆగిపోవు. ఈ డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు మీ ఫోన్, ఇంటర్నెట్ ద్వారా 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. మీరు మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం (ATM)ల ద్వారా మీ డబ్బు లావాదేవీలు, ఇతర బ్యాంకింగ్ పనులను సులభంగా చేసుకోవచ్చు.

డబ్బు పంపాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా, లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా – ఈ సేవలు సెలవుల రోజుల్లో కూడా కొనసాగుతాయి. అయితే, కొన్ని పనులకు మాత్రం మీరు తప్పనిసరిగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఉదాహరణకు, చెక్కులు జమ చేయడం, లోన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించడం, లేదా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేయడం వంటివి. కాబట్టి, జూలైలో బ్యాంకుకు వెళ్లాలని ఆలోచిస్తుంటే, సెలవుల జాబితాను దృష్టిలో పెట్టుకుని మీ పనులను ప్లాన్ చేసుకోండి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం, ప్రతి నెల రెండో, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. దీనితో పాటు ప్రతి ఆదివారం కూడా సెలవు ఉంటుంది. వీటికి తోడు, జూలైలో అనేక పండుగలు, ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని జూలై 2025లో మొత్తం 13 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ సెలవులు జాతీయ, ప్రాంతీయ స్థాయిలో ఉంటాయి. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు రోజుల్లో వర్తిస్తాయి. సెలవుల పూర్తి జాబితా ఇదే

జూలై 3 (గురువారం): ఖర్ఛీ పూజ సందర్భంగా అగర్తలాలో (త్రిపుర) అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి.

జూలై 5 (శనివారం): గురు హర్గోబింద్ జీ జయంతి సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి. ముఖ్యంగా సిక్కులు ఈ పండుగను ఘనంగా జరుపుకునే రాష్ట్రాల్లో ఈ సెలవు ఉంటుంది.

జూలై 6 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ రోజు మొహర్రం సెలవు కూడా కొన్ని రాష్ట్రాలలో ఉండవచ్చు.

జూలై 12 (శనివారం): నెలలో రెండవ శనివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి. ఇది RBI నిబంధనల ప్రకారం నెలవారీ ఫిక్స్‌డ్ సెలవు.

జూలై 13 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.

జూలై 14 (సోమవారం): బెహ్ డియన్ఖ్లామ్ (Beh Dienkhlam) పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ పండుగ ముఖ్యంగా మేఘాలయలో జరుపుకుంటారు.

జూలై 16 (బుధవారం): హరేలా పర్వ సందర్భంగా ఉత్తరాఖండ్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

జూలై 17 (గురువారం): యు తిరోట్ సింగ్ పుణ్యతిథి సందర్భంగా షిల్లాంగ్‌లో (మేఘాలయ) అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి.

జూలై 19 (శనివారం): కేర్ పూజ కోసం అగర్తలాలో (త్రిపుర) మళ్లీ బ్యాంకులు మూసి ఉంటాయి. ఇది త్రిపురలో ఒక ముఖ్యమైన పండుగ.

జూలై 20 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.

జూలై 26 (శనివారం): నెలలో నాల్గవ శనివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి.

జూలై 27 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.

జూలై 28 (సోమవారం): ద్రుక్పా త్షే-జీ (Drukpa Tshe-Zhi) సందర్భంగా గాంగ్‌టక్‌లో (సిక్కిం) బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇది సిక్కింలో బౌద్దుల ప్రత్యేక పండుగ.

జూలైలో సెలవుల కారణంగా మీరు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్ళలేకపోతే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ ద్వారా దాదాపు అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలను పూర్తి చేయవచ్చు. ఒకవేళ మీరు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సి వచ్చే పని ఏదైనా ఉంటే, సెలవుల జాబితాను గుర్తుంచుకుని ముందుగానే మీ పనులను ప్లాన్ చేసుకోండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story