Motorola : రూ.9,999కే 5 కెమెరాలు, 6000mAh బ్యాటరీ.. మోటరోలా G10 పవర్ Vs Vivo, Realme!
మోటరోలా G10 పవర్ Vs Vivo, Realme!

Motorola : రూ.10,000 లోపు మంచి ఫీచర్లున్న ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మోటరోలా G10 పవర్ ట్రై చేయవచ్చు. ఈ ఫోన్‌లో అద్భుతమైన 5 కెమెరాలు, ఒక పెద్ద 6000mAh బ్యాటరీ ఉన్నాయి. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ ఫోన్ మూడు రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. మోటరోలా కంపెనీ చెబుతున్న దాని ప్రకారం, మోటరోలా G10 పవర్ బ్యాటరీ 190 గంటల వరకు మ్యూజిక్ స్ట్రీమింగ్, 23 గంటల వరకు వీడియో స్ట్రీమింగ్, 20 గంటల వరకు ఇంటర్నెట్ బ్రౌజింగ్కు సపోర్ట్ చేస్తుంది. నిత్యం ఫోన్ వాడేవారైనా సరే ఈ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తుంది.
మోటరోలా బ్రాండ్‌కు చెందిన ఈ బడ్జెట్ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999 కి అందుబాటులో ఉంది. ఈ ధరలో 4 GB RAM/64 GB స్టోరేజ్ వేరియంట్ లభిస్తుంది. ఒకవేళ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటే రూ.9,400 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ధరలో ఇది Vivo T4 Lite 5G (ధర రూ.9,999), రియల్‌మీ C75 5G (ధర రూ.12,999) వంటి ఫోన్‌లకు గట్టి పోటీ ఇస్తుంది.
మోటరోలా G10 పవర్ స్పెసిఫికేషన్స్
స్క్రీన్: ఈ ఫోన్‌లో 6.51 అంగుళాల హెచ్‌డీ+ రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లే ఉంటుంది. వీడియోలు చూడటానికి, గేమ్‌లు ఆడటానికి ఇది మంచి ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
ప్రాసెసర్: రోజువారీ పనులన్నింటినీ సులభంగా నిర్వహించడానికి, ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 460 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఫోన్‌లో 128 GB స్టోరేజ్ ఉన్నప్పటికీ, మైక్రోఎస్డీ కార్డు సహాయంతో స్టోరేజ్‌ను 1 TB వరకు సులభంగా పెంచుకోవచ్చు.
కెమెరా: ఈ ఫోన్‌లో మొత్తం 5 కెమెరాలు ఉన్నాయి – వెనుకవైపు 4, ముందువైపు 1. వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, దానితో పాటు 8 మెగాపిక్సెల్ సెకండరీ (అల్ట్రా వైడ్) కెమెరా, 2 మెగాపిక్సెల్ చొప్పున రెండు కెమెరాలు (మ్యాక్రో, డెప్త్ సెన్సార్) ఉన్నాయి. ఇక ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. మంచి ఫోటోలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.
బ్యాటరీ: ఈ ఫోన్‌కు ప్రాణం పోయడానికి 6000 mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. తక్కువ సమయంలోనే ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు.
