ఎయిర్‌టెల్ అరాచకమైన ఆఫర్..ఒకే రేటుకు ఎక్స్‌ట్రా డేటా

Airtel vs Jio 449 plan : టెలికాం రంగంలో అగ్రగామి కంపెనీలైన ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో మధ్య పోటీ ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి యూజర్లను ఆకట్టుకోవడానికి ఈ రెండు కంపెనీలు రకరకాల ప్లాన్లను ప్రకటిస్తుంటాయి. అయితే ప్రస్తుతం రూ.449 ధర వద్ద ఈ రెండు కంపెనీలు అందిస్తున్న ఆఫర్లను గమనిస్తే..ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు జియో కంటే ఎక్కువ లాభాలను అందిస్తూ షాక్ ఇచ్చింది. ఒకే ధరకు లభించే ఈ రెండు ప్లాన్లలో ఏది బెస్ట్? ఏ ప్లాన్ ఎంచుకుంటే మీకు ఎక్కువ డేటా వస్తుంది? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్ రూ. 449 ప్లాన్ : ఎయిర్‌టెల్ అందిస్తున్న రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్ ముఖ్యంగా ఇంటర్నెట్ ఎక్కువగా వాడే వారికి ఒక వరం లాంటిది. ఈ ప్లాన్ ద్వారా ప్రతిరోజూ 4 GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. అంటే మొత్తం నెలలో మీరు ఏకంగా 112 GB డేటాను పొందవచ్చు. దీంతో పాటు అన్ లిమిటెడ్ ఉచిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉంటాయి. అదనపు ప్రయోజనాల విషయానికొస్తే.. 30 GB గూగుల్ వన్ స్టోరేజ్, జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ద్వారా 20కి పైగా ఓటీటీ యాప్స్, ఆపిల్ మ్యూజిక్ మరియు అపరిమిత 5G డేటా వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

జియో రూ. 449 ప్లాన్ : ఇక జియో విషయానికి వస్తే.. అదే రూ.449 ధరలో జియో తన కస్టమర్లకు ప్రతిరోజూ 3 GB హై స్పీడ్ డేటా మాత్రమే అందిస్తోంది. దీని వ్యాలిడిటీ కూడా 28 రోజులే. అంటే మొత్తం ప్లాన్ కాలంలో మీకు 84 GB డేటా మాత్రమే వస్తుంది. ఎయిర్‌టెల్‌తో పోలిస్తే ఇక్కడ మీకు ఏకంగా 28 GB డేటా తక్కువగా లభిస్తుంది. అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్‌లు సమానంగా ఉన్నప్పటికీ, అదనపు ప్రయోజనాల్లో జియో కేవలం జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ స్టోరేజ్ వంటి బేసిక్ ఆఫర్లకే పరిమితమైంది.

రెండింటినీ పోల్చి చూస్తే.. ఒకే రేటులో ఎయిర్‌టెల్ ప్రతిరోజూ 1 GB అదనపు డేటాను (మొత్తం 28 GB ఎక్కువ) ఆఫర్ చేస్తోంది. హెవీ డౌన్‌లోడ్స్ చేసేవారికి, గంటల తరబడి వీడియోలు చూసేవారికి ఎయిర్‌టెల్ ప్లాన్ చాలా లాభదాయకం. అంతేకాకుండా ఎయిర్‌టెల్ ప్లాన్‌తో వచ్చే ఓటీటీ బెనిఫిట్స్, పెర్ప్లెక్సిటీ ప్రో వంటి ఏఐ టూల్స్ సబ్‌స్క్రిప్షన్స్ యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. జియో కేవలం తన సొంత యాప్స్‌కే పరిమితం అవ్వడం ఇక్కడ కొంత మైనస్‌గా మారింది.

మీరు ఒకే ధరకు ఎక్కువ ఇంటర్నెట్, ఎక్కువ ఓటీటీ కంటెంట్ కావాలనుకుంటే కళ్లు మూసుకుని ఎయిర్‌టెల్ వైపు వెళ్లవచ్చు. ఒకవేళ మీ ఏరియాలో ఎయిర్‌టెల్ సిగ్నల్ కంటే జియో సిగ్నల్ బలంగా ఉండి, రోజుకు 3 GB డేటా సరిపోతుంది అనుకుంటే జియోలో కొనసాగవచ్చు. అయితే కేవలం డేటా పరంగా చూస్తే మాత్రం ఎయిర్‌టెల్ స్పష్టమైన విజేతగా నిలిచింది. రీఛార్జ్ చేసే ముందు మీ అవసరాలను బట్టి సరైన నిర్ణయం తీసుకోండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story