Airtel : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే 22 ఓటీటీలు.. ఈ ప్లాన్ వినోదాల ఖజానా
తక్కువ ధరకే 22 ఓటీటీలు.. ఈ ప్లాన్ వినోదాల ఖజానా

Airtel : నేటి కాలంలో ఇంటి నుంచి పని చేసేవారికైనా లేదా వినోదం కోరుకునే వారికైనా మంచి ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి. అందుకే ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం కేవలం డేటాను మాత్రమే కాకుండా, అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించే అదిరిపోయే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. మీరు ఇంటి కోసం తక్కువ ధరలో మంచి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ వెతుకుతున్నట్లయితే, ఎయిర్‌టెల్ రూ.699 ప్లాన్ (ఎయిర్ ఫైబర్) మీకు బెస్ట్ ఆప్షన్. ఈ ప్లాన్‌తో మీకు 40 Mbps వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. సాధారణంగా ఎయిర్ ఫైబర్ ప్లాన్‌లలో నెలకు 1 TB (1000 GB) డేటాను కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఒకవేళ మీరు ఎయిర్‌టెల్ ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే, ఇదే ప్లాన్‌పై మీకు 3.3 TB డేటా లభించే అవకాశం ఉంటుంది.
ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో మీకు 22కి పైగా ఓటీటీ (OTT) యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్, సన్ నెక్స్ట్, ఆహా , చౌపల్, ఈరోస్ నౌ వంటి ప్రముఖ యాప్‌లను మీరు ఉచితంగా చూడవచ్చు. ఇవే కాకుండా, 350కి పైగా లైవ్ టీవీ ఛానెళ్ల యాక్సెస్ కూడా లభిస్తుంది. అంటే టీవీ రీఛార్జ్ కూడా ఇందులో కలిసిపోయినట్లే!
అసలు ధర ఎంత ఉంటుంది?
బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల విషయంలో ప్లాన్ ధరపై ఎప్పుడూ 18 శాతం జీఎస్‌టీ అదనంగా ఉంటుంది. ఎయిర్‌టెల్ రూ.699 ప్లాన్‌పై 18 శాతం జీఎస్‌టీ కలిపితే, నెలకు మీరు చెల్లించాల్సిన మొత్తం రూ.824.82 అవుతుంది. జియో లేదా మరే ఇతర కంపెనీ తీసుకున్నా ఈ టాక్స్ రూల్ వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ వినోదం కావాలనుకునే వారికి ఇది పక్కా ప్లాన్.
మరింత వేగం కావాలనుకునే వారి కోసం..
ఒకవేళ మీకు 40 Mbps వేగం సరిపోదు అనుకుంటే, ఎయిర్‌టెల్ వద్ద రూ.799 ప్లాన్ కూడా ఉంది. ఇది 100 Mbps వేగాన్ని ఇస్తుంది. అయితే, ఇందులో ఓటీటీ బెనిఫిట్స్ ఉండవు. మీరు 100 Mbps వేగంతో పాటు ఓటీటీ సదుపాయాలు కావాలనుకుంటే రూ.899 ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఎక్కువ వేగంతో పాటు మీకు నచ్చిన సినిమాలను కూడా ఎంజాయ్ చేయవచ్చు.

