Amazon Prime Day Sale : ప్రైమ్ డే సేల్ 2025 ముందు అమెజాన్ బంపర్ ఆఫర్.. ప్రతీ కొనుగోలుపై 5శాతం క్యాష్‌బ్యాక్!
ప్రతీ కొనుగోలుపై 5శాతం క్యాష్‌బ్యాక్!

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభానికి ముందే వినియోగదారులకు పెద్ద బహుమతిని ప్రకటించింది. కంపెనీ మీ కోసం రివార్డ్స్ గోల్డ్ క్యాష్‌బ్యాక్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. జూలై 12న అమెజాన్ సేల్ మొదలవుతుంది. మూడు రోజుల పాటు ఈ సేల్ లైవ్‌లో ఉంటుంది. ఉత్పత్తులపై డిస్కౌంట్‌తో పాటు, ఇప్పుడు 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇచ్చే ఈ ప్రోగ్రామ్ కూడా ప్రజలకు బాగా నచ్చుతుంది. కంపెనీ ఈ కొత్త ప్రోగ్రామ్ కింద, మీరు చేసే ప్రతి కొనుగోలుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
మీకు క్యాష్‌బ్యాక్ బెనిఫిట్ లభించాలంటే.. అమెజాన్ పే ద్వారా బిల్లు చెల్లింపులు చేయాలి. ఈ గోల్డ్ ప్రోగ్రామ్ ప్రయోజనం ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నా లేకపోయినా అందరికీ లభిస్తుంది. అయితే, క్యాష్‌బ్యాక్ శాతంలో తేడా ఉంటుంది. ప్రైమ్ మెంబర్ అయితే, మీకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మీరు ప్రైమ్ మెంబర్ కాకపోతే, మీకు 3 శాతం క్యాష్‌బ్యాక్ ప్రయోజనం లభిస్తుంది.
ఈ ప్రయోజనాన్ని పొందడానికి, మీరు మూడు నెలల్లో 25 ట్రాన్సాక్షన్లు పూర్తి చేయాలి. అమెజాన్ పే ద్వారా యూపీఐ చెల్లింపులు, క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా చెల్లింపులు, డబ్బు పంపడం, బిల్లు చెల్లింపులు లేదా కొనుగోళ్లు వంటివి ఈ 25 ట్రాన్సాక్షన్లలో భాగంగా ఉంటాయి. 25 ట్రాన్సాక్షన్లు పూర్తి చేసిన తర్వాత, మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందడం మొదలవుతుంది. అంతేకాదు, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్న వినియోగదారులకు రివార్డ్స్ గోల్డ్ ప్రోగ్రామ్‌లో అదనపు ప్రయోజనం లభిస్తుందని కంపెనీ తెలిపింది.
జూలై 12 నుండి ప్రారంభం కానున్న అమెజాన్ సేల్ కోసం, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలతో అమెజాన్ చేతులు కలిపింది. దీని అర్థం ఏమిటంటే, మీరు షాపింగ్ చేసేటప్పుడు ఈ రెండు బ్యాంకులలో ఏదైనా ఒక బ్యాంక్ కార్డ్ ద్వారా బిల్లు చెల్లిస్తే, మీకు 10 శాతం అదనపు ఆదా చేసుకునే గొప్ప అవకాశం లభిస్తుంది.
