Vantara Creamery : రిలయన్స్ వారసుడు అనంత్ అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ వంతారా ఇప్పుడు కేవలం జంతువుల సంరక్షణకే పరిమితం కాలేదు. తాజాగా ఫుడ్ అండ్ బెవరేజ్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. వంతారా క్రీమరీ పేరుతో ఒక లగ్జరీ ఐస్‌క్రీమ్ బ్రాండ్‌ను లాంచ్ చేశారు. ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో ఒక స్టైలిష్ ఐస్‌క్రీమ్ ట్రక్ ద్వారా ఈ బ్రాండ్ అట్టహాసంగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మే 16, 17 తేదీల్లో ముంబై వాసులకు ఈ ప్రీమియం రుచులను ఆస్వాదించే అవకాశం లభించింది.

వంతారా క్రీమరీ ఐస్‌క్రీమ్స్‌లో వాడుతున్న ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. సాధారణ ఐస్‌క్రీమ్స్ లాగా కాకుండా వీటిని అత్యంత నాణ్యమైన A2 గిర్ ఆవు పాలతో తయారు చేస్తున్నారు. దీనివల్ల ఐస్‌క్రీమ్ చాలా క్రీమీగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని కంపెనీ చెబుతోంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, స్వచ్ఛమైన భారతీయ పాడి ఉత్పత్తులతో ఈ ఆర్టిజనల్ ఐస్‌క్రీమ్స్ రూపొందాయి.

17 రకాల వెరైటీ ఫ్లేవర్లు.. దేశీ రుచుల కలబోత

వంతారా క్రీమరీ మొత్తం 17 రకాల విభిన్నమైన ఫ్లేవర్లను మార్కెట్లోకి తెచ్చింది. మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా భారతీయ రుచులకు ఇందులో పెద్దపీట వేశారు.

* మలై కుల్ఫీ: సాంప్రదాయ భారతీయ రుచిని ఇష్టపడే వారి కోసం.

* జామకాయ - కారం : తియ్యగా, ఘాటుగా ఉండే ఈ కాంబినేషన్ కొత్త అనుభూతినిస్తుంది.

* ఫిల్టర్ కాఫీ: కాఫీ ప్రియుల కోసం ప్రత్యేకంగా తయారు చేశారు.

* లెమన్ సోర్బెట్: వేసవి తాపాన్ని తగ్గించేందుకు పుల్లపుల్లని నిమ్మకాయ ఫ్లేవర్.

వీటితో పాటు స్థానిక ముడి పదార్థాలు, భారతీయ కథలతో ముడిపడిన మరెన్నో ప్రీమియం ఫ్లేవర్లు అందుబాటులో ఉన్నాయి.

ధర వింటే షాక్ అవ్వాల్సిందే

ప్రీమియం కేటగిరీలో లాంచ్ అయిన ఈ ఐస్‌క్రీమ్ ధరలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. వంతారా క్రీమరీలో ఒక ఐస్‌క్రీమ్ స్కూప్ ధర రూ.750 నుంచి ప్రారంభమవుతుంది. సామాన్యులకు ఇది కాస్త ఖరీదైనదే అయినప్పటికీ, వాడే ఇంగ్రీడియంట్స్, లగ్జరీ అనుభూతి కోసం ఐస్‌క్రీమ్ ప్రియులు వీటిని టేస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రెలయన్స్ ఫౌండేషన్ మద్దతుతో నడుస్తున్న ఈ ప్రాజెక్ట్, అనంత్ అంబానీ పర్యవేక్షణలో సరికొత్త రికార్డుల దిశగా సాగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story