ఎలా సంపాదించింది?

Asian Paints : దేశంలోని అతిపెద్ద పెయింట్ కంపెనీ ఏషియన్ పెయింట్స్ ఒక్కసారిగా రూ.734 కోట్ల ఆదాయాన్ని పొందింది. ఏషియన్ పెయింట్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో మిగతా పోటీ కంపెనీలు ఆశ్చర్యపోయాయి. బుధవారం ఏషియన్ పెయింట్స్, అక్జో నోబెల్ ఇండియాలోని తన 4.42 శాతం వాటాను రూ.734 కోట్లకు విక్రయించింది. ఈ పరిణామంతో ఏషియన్ పెయింట్స్ షేర్ ధర కూడా పెరిగింది. మరి ఏషియన్ పెయింట్స్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో తెలుసుకుందాం. ఏషియన్ పెయింట్స్ వద్ద అక్జో నోబెల్ ఇండియా కు చెందిన 20,10,626 షేర్లు ఉన్నాయి. వీటి ద్వారా ఏషియన్ పెయింట్స్ కు ఆ కంపెనీలో 4.42శాతం వాటా ఉండేది. ఈ లావాదేవీ ఒక పెద్ద బ్లాక్ డీల్ ద్వారా జరిగింది. ఒక్కో షేరు ధర రూ.3,651 చొప్పున, ఈ మొత్తం డీల్ విలువ దాదాపు రూ.734 కోట్లుగా నమోదైంది. ఈ డీల్ తర్వాత, ఏషియన్ పెయింట్స్ కు అక్జో నోబెల్ ఇండియాలో ఎటువంటి పెట్టుబడులు లేవు.

పెయింట్ పరిశ్రమలో తీవ్రమైన పోటీ నెలకొన్న సమయంలో ఏషియన్ పెయింట్స్ ఈ వాటాను విక్రయించింది. ముఖ్యంగా, జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్, డ్యూలక్స్ బ్రాండ్‌ను తయారుచేసే కంపెనీని రూ.8,986 కోట్లకు కొనుగోలు చేయడంతో ఈ పోటీ మరింత పెరిగింది. జేఎస్‌డబ్ల్యూతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. డచ్ కంపెనీ (అక్జో నోబెల్) తన వాటాను రెండు ప్రమోటర్ కంపెనీల ద్వారా విక్రయించనుంది. అవి: ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(దీనికి 50.46% వాటా ఉంది), అక్జో నోబెల్ కోటింగ్స్ ఇంటర్నేషనల్ బీ.వి.(దీనికి 24.30% వాటా ఉంది).

బుధవారం ఏషియన్ పెయింట్స్ షేర్ రూ.2,498.75 వద్ద ముగిసింది, ఇది మునుపటి రోజు కంటే 0.57శాతం ఎక్కువ. భారతదేశంలోని పెయింట్ మార్కెట్ సుమారు రూ.90,000 కోట్లు విలువ చేస్తుంది. ఇందులో ఏషియన్ పెయింట్స్, బిర్లా ఓపస్, బెర్గర్ పెయింట్స్, నిప్పాన్ పెయింట్స్, ఇండిగో పెయింట్స్, అక్జో నోబెల్ ఇండియా వంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన బిర్లా ఓపస్ ఫిబ్రవరి 2024లో రంగప్రవేశం చేయడంతో ఈ పోటీ మరింత తీవ్రమైంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story