సెలవుల జాతర ఎప్పుడెప్పుడంటే?

Bank Holidays : కొత్త ఏడాది 2026 అడుగుపెట్టింది. ఈ ఏడాదంతా మీ ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకింగ్ పనులను ముందస్తుగా ప్లాన్ చేసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన హాలిడే లిస్ట్ చాలా కీలకం. ఏయే రోజుల్లో బ్యాంకులు మూతపడతాయి, ఏయే పండుగలకు సెలవులు ఉన్నాయో తెలిస్తే.. ఆఖరి నిమిషంలో ఇబ్బందులు కలగకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా నగదు విత్ డ్రా చేయడం లేదా డిపాజిట్ చేయడం వంటి పనుల కోసం ఈ లిస్ట్ ఒక గైడ్‌లా ఉపయోగపడుతుంది.

భారతదేశంలో బ్యాంకులు రెండు రకాల సెలవులను పాటిస్తాయి. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి వంటి జాతీయ సెలవులు దేశమంతా వర్తిస్తాయి. అయితే, మహాశివరాత్రి, హోలీ, ఉగాది, బక్రీద్, జన్మాష్టమి, దీపావళి వంటి పండుగ సెలవులు ఆయా రాష్ట్రాల సంస్కృతిని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి మీ ఊరిలో బ్యాంక్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ క్యాలెండర్ ముందే చూసుకోవడం బెటర్.

2026లో కూడా బ్యాంకులు ప్రతి నెల రెండో, నాలుగో శనివారాల్లో పనిచేయవు. ఇది కాకుండా ఆదివారాలు యథావిధిగా సెలవు దినాలే. ఒకవేళ పండుగ సెలవు శనివారం లేదా ఆదివారంతో కలిసి వస్తే అది బ్యాంకులకు అదనపు భారంగా మారదు. అయితే సెలవు రోజుల్లో కూడా నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. కేవలం ఫిజికల్ బ్యాంకింగ్ పనులకే ఈ సెలవులు వర్తిస్తాయి.

2026 బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా:

జనవరి 10 – రెండో శనివారం (శనివారం)

జనవరి 24 – నాలుగో శనివారం (శనివారం)

జనవరి 26 – గణతంత్ర దినోత్సవం (సోమవారం)

ఫిబ్రవరి 14 – రెండో శనివారం (శనివారం)

ఫిబ్రవరి 15 – మహా శివరాత్రి (ఆదివారం)

ఫిబ్రవరి 28 – నాలుగో శనివారం (శనివారం)

మార్చి 3 – హోలీ (మంగళవారం)

మార్చి 14 – రెండో శనివారం (శనివారం)

మార్చి 20 – ఉగాది (శుక్రవారం)

మార్చి 28 – నాలుగో శనివారం (శనివారం)

ఏప్రిల్ 3 – గుడ్ ఫ్రైడే (శుక్రవారం)

ఏప్రిల్ 11 – రెండో శనివారం (శనివారం)

ఏప్రిల్ 14 – అంబేద్కర్ జయంతి (మంగళవారం)

ఏప్రిల్ 25 – నాలుగో శనివారం (శనివారం)

మే 1 – మే డే / కార్మిక దినోత్సవం (శుక్రవారం)

మే 9 – రెండో శనివారం (శనివారం)

మే 23 – నాలుగో శనివారం (శనివారం)

మే 27 – బక్రీద్ / ఈద్-ఉల్-అజా (బుధవారం)

జూన్ 13, 27 – రెండో & నాలుగో శనివారాలు (శనివారం)

జూలై 11, 25 – రెండో & నాలుగో శనివారాలు (శనివారం)

ఆగస్టు 15 – స్వాతంత్య్ర దినోత్సవం (శనివారం)

సెప్టెంబర్ 4 – జన్మాష్టమి (శుక్రవారం)

అక్టోబర్ 2 – గాంధీ జయంతి (శుక్రవారం)

నవంబర్ 8 – దీపావళి (ఆదివారం)

డిసెంబర్ 25 – క్రిస్మస్ డే (శుక్రవారం)

PolitEnt Media

PolitEnt Media

Next Story