Bank Holidays : పండుగలు, వీకెండ్స్.. మే నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు పనిచేయవో లిస్ట్ ఇదే
మే నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు పనిచేయవో లిస్ట్ ఇదే

Bank Holidays : మే నెల వచ్చేస్తోంది. ఎండలతో పాటు సెలవుల సందడి కూడా మొదలైంది. ఒకవేళ మీరు మే నెలలో బ్యాంకు పనులేవైనా ప్లాన్ చేసుకుంటే, ముందుగా ఈ సెలవుల జాబితాను ఒకసారి చెక్ చేసుకోవడం ఉత్తమం. మే 2026లో మే డే, బుద్ధ పూర్ణిమ, మహారాష్ట్ర డే, బక్రీద్ వంటి పండుగలతో పాటు వీకెండ్ సెలవులు కూడా తోడవడంతో బ్యాంకులు చాలా రోజులు మూతపడనున్నాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా, కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన సెలవుల పూర్తి జాబితా ఇదే.
మే నెల 2026 సెలవుల పూర్తి షెడ్యూల్
మే నెలలో వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే ప్రాంతీయ పండుగలు, జాతీయ సెలవుల వల్ల బ్యాంకులు పనిచేయవు. అయితే, ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ మరియు ఏటీఎం సేవలు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి.
* మే 1 (శుక్రవారం): మే డే (కార్మిక దినోత్సవం), మహారాష్ట్ర దినోత్సవం, బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి. అయితే గుజరాత్, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయి.
* మే 3 (ఆదివారం): దేశవ్యాప్తంగా సాధారణ సెలవు.
* మే 9 (శనివారం): ఇది నెలలో రెండో శనివారం. దీనికి తోడు పశ్చిమ బెంగాల్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు సెలవు.
* మే 10 (ఆదివారం): దేశవ్యాప్తంగా సాధారణ సెలవు.
* మే 16 (శనివారం): సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అక్కడ మాత్రమే సెలవు.
* మే 17 (ఆదివారం): దేశవ్యాప్తంగా సాధారణ సెలవు.
* మే 23 (శనివారం): నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
* మే 24 (ఆదివారం): దేశవ్యాప్తంగా సాధారణ సెలవు.
* మే 26 (మంగళవారం): కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు సెలవు.
బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) సెలవుల గందరగోళం:
బక్రీద్ పండుగ తేదీలు రాష్ట్రాలవారీగా మారుతూ ఉంటాయి.
* మే 27 (బుధవారం): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో బక్రీద్ సందర్భంగా బ్యాంకులు మూసివేస్తారు. అయితే మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ రోజు బ్యాంకులు పనిచేస్తాయి.
* మే 28 (గురువారం): మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, బీహార్‌లలో బక్రీద్ సెలవు ఉంటుంది.
* మే 31 (ఆదివారం): నెల చివరి ఆదివారం.. దేశవ్యాప్తంగా సెలవు.
అందుబాటులో ఆన్‌లైన్ సేవలు
బ్యాంకు శాఖలు భౌతికంగా మూతపడినప్పటికీ, కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. అత్యవసరంగా నగదు అవసరమైన వారు ఏటీఎంలను ఆశ్రయించవచ్చు లేదా యూపీఐ ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు. చెక్కుల క్లియరెన్స్ వంటి పనులకు మాత్రం సెలవు రోజులు మినహా మిగిలిన పనిదినాల కోసం వేచి చూడాల్సిందే.

