ఎప్పుడెప్పుడు సెలవులో చూసుకోండి

Bank Holidays : పండగల సీజన్ వచ్చేసింది.. ముఖ్యంగా అక్టోబర్ 2025 నెల మొత్తం సెలవులతో నిండిపోయింది. ఈ నెలలో శనివారాలు, ఆదివారాలు, వివిధ పండుగల సెలవులు కలుపుకొని ఏకంగా 21 రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఈ సెలవులలో కొన్ని దేశవ్యాప్తంగా వర్తిస్తాయి. మరికొన్ని ఆయా రాష్ట్రాల పండుగలు, సంప్రదాయాలను బట్టి ఉంటాయి. కాబట్టి, బ్యాంక్ పనులు ఉన్నవారు ఈ సెలవుల జాబితాను ముందుగానే చూసుకొని ప్రణాళిక వేసుకోవడం మంచిది. దసరా, దీపావళి, గాంధీ జయంతి, వాల్మీకి జయంతి, దుర్గా పూజ, కర్వా చౌత్, ఛత్ పూజ వంటి అనేక ముఖ్యమైన పండుగలు ఈ అక్టోబర్ నెలలోనే వస్తాయి.

అక్టోబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా

కింద ఇవ్వబడిన జాబితాలో అక్టోబర్ నెలలోని మొత్తం బ్యాంక్ సెలవులు ఉన్నాయి. కొన్ని సెలవులు నిర్దిష్ట రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయని గుర్తుంచుకోండి.

అక్టోబర్ 1, బుధవారం: మహానవమి (చాలా ప్రాంతాల్లో సెలవు)

అక్టోబర్ 2, గురువారం: గాంధీ జయంతి, విజయదశమి (దేశవ్యాప్త సెలవు)

అక్టోబర్ 3, శుక్రవారం: దుర్గా పూజ (సిక్కింలో సెలవు)

అక్టోబర్ 4, శనివారం: దుర్గా పూజ (సిక్కింలో సెలవు)

అక్టోబర్ 5, ఆదివారం: ఆదివారం సెలవు

అక్టోబర్ 6, సోమవారం: లక్ష్మీ పూజ (త్రిపుర, బెంగాల్‌లో సెలవు)

అక్టోబర్ 7, మంగళవారం: వాల్మీకి జయంతి (కొన్ని రాష్ట్రాల్లో సెలవు)

అక్టోబర్ 10, శుక్రవారం: కర్వా చౌత్ (హిమాచల్ ప్రదేశ్‌లో సెలవు)

అక్టోబర్ 11, శనివారం: రెండవ శనివారం సెలవు

అక్టోబర్ 12, ఆదివారం: ఆదివారం సెలవు

అక్టోబర్ 18, శనివారం: కటి బిహు (అస్సాంలో సెలవు)

అక్టోబర్ 19, ఆదివారం: సాధారణ ఆదివారం సెలవు

అక్టోబర్ 20, సోమవారం: దీపావళి, కాళీ పూజ (చాలా ప్రాంతాల్లో సెలవు)

అక్టోబర్ 21, మంగళవారం: దీపావళి అమావాస్య, గోవర్ధన్ పూజ (మహారాష్ట్ర, ఒడిశా వంటి కొన్ని ప్రాంతాల్లో సెలవు)

అక్టోబర్ 22, బుధవారం: దీపావళి లక్ష్మీ పూజ, బలిపాడ్యమి (అనేక రాష్ట్రాల్లో సెలవు)

అక్టోబర్ 23, గురువారం: భాయి దూజ్, లక్ష్మీ పూజ, చిత్రగుప్త పూజ (కొన్ని రాష్ట్రాల్లో సెలవు)

అక్టోబర్ 25, శనివారం: నాల్గవ శనివారం సెలవు

అక్టోబర్ 26, ఆదివారం: ఆదివారం సెలవు

అక్టోబర్ 27, సోమవారం: ఛత్ పూజ (బెంగాల్, బీహార్, జార్ఖండ్‌లో సెలవు)

అక్టోబర్ 28, మంగళవారం: ఛత్ పూజ (బెంగాల్, బీహార్, జార్ఖండ్‌లో సెలవు)

అక్టోబర్ 31, శుక్రవారం: సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి (గుజరాత్‌లో సెలవు)

సెలవు రోజుల్లోనూ అందుబాటులో ఆన్‌లైన్ సేవలు

బ్యాంకుల కార్యాలయాలు మూసి ఉన్నప్పటికీ, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. నగదు అవసరమైన వారికి ఏటీఎంలు ఎల్లప్పుడూ పనిచేస్తాయి. నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా డబ్బు చెల్లింపులు, బదిలీలు చేసుకోవచ్చు. అయితే, చెక్కులు సమర్పించడం, ఆర్‌టీజీఎస్ వంటి కొన్ని పనులకు మాత్రం బ్యాంక్ కార్యాలయాలకు వెళ్లాలి కాబట్టి, అలాంటి వారు సెలవు రోజులను దృష్టిలో ఉంచుకొని తమ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

PolitEnt Media

PolitEnt Media

Next Story