తగ్గిన లోన్ వడ్డీ రేట్లు

HDFC : హెచ్‎డీఎఫ్‎సీ బ్యాంక్ తన కస్టమర్లకు పెద్ద ఊరట కల్పించింది. బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్‎ను 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో లోన్ వడ్డీ రేట్లు తగ్గుతాయి. ముఖ్యంగా ఈ బెంచ్‌మార్క్‌తో ముడిపడి ఉన్న లోన్‌లు తీసుకున్న కస్టమర్లందరికీ ఇది లాభం చేకూరుస్తుంది. ఈ మార్పు జులై 7, 2025 నుండి అమలులోకి వచ్చింది. దీని వల్ల వివిధ కాలపరిమితి లోన్ల వడ్డీ రేట్లు తగ్గాయి. గతంలో బ్యాంక్ MCLR 8.90% నుండి 9.10% మధ్య ఉండేది. అది ఇప్పుడు తగ్గి 8.60% నుండి 8.80% మధ్యకు వచ్చింది. ఈ తగ్గింపు ఓవర్‌నైట్, ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాల కాలపరిమితి లోన్‌లపై ప్రభావం చూపుతుంది. ఈ నిర్ణయం వల్ల కస్టమర్లు తక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. దీనితో వారి నెలవారీ EMI తగ్గుతాయి. ఆర్థిక భారం తగ్గుతుంది.

హోమ్ లోన్‌ల విషయానికి వస్తే, హెచ్‎డీఎఫ్‎సీ బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు రెపో రేటుతో ముడిపడి ఉంటాయి. లోన్ కాలపరిమితి అంతటా మారవచ్చు. ప్రస్తుతం, జులై 7, 2025 నాటికి సాధారణ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.50% నుండి 9.40% మధ్య ఉన్నాయి. అయితే ప్రత్యేక రేట్లు 7.90% నుండి 9.00% మధ్య ఉన్నాయి. ఈ రేట్లు ప్రస్తుత 5.50% రెపో రేటు ఆధారంగా నిర్ణయించబడ్డాయి. ఈ తగ్గింపు కొత్త హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్న వారికి లేదా ఇప్పటికే రెపో రేటుతో ముడిపడి ఉన్న లోన్‌లు ఉన్న వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.

MCLR అంటే ఏమిటి?

MCLR (Marginal Cost of Funds Based Lending Rate) అనేది భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించిన ఒక బెంచ్‌మార్క్ వడ్డీ రేటు. దీని ఆధారంగా బ్యాంకులు తమ లోన్‌ల వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. ఇది బ్యాంకులు లోన్ ఇవ్వగలిగే కనీస రేటు. MCLRను లెక్కించడానికి బ్యాంక్ అప్పు తీసుకునే ఖర్చు, డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటు, నిర్వహణ ఖర్చులు, CRR (క్యాష్ రిజర్వ్ రేషియో)పై ప్రతికూల ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story