బిఎస్ఎన్ఎల్ కొట్టిన దెబ్బకు టెలికాం రంగం విలవిల

BSNL : ప్రభుత్వరంగ టెలికాం దిగ్గజం బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం ఒక అదిరిపోయే ఆఫర్‌ను మళ్ళీ పట్టాలెక్కించింది. జనాల నుంచి వస్తున్న విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తన పాపులర్ ఫ్రీడం ప్లాన్‎ను తిరిగి ప్రవేశపెట్టింది. కేవలం ఒక్క రూపాయికే మీరు ఊహించని బెనిఫిట్స్ పొందే అవకాశం ఈ ప్లాన్ ద్వారా లభిస్తోంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఏమిటీ ఒక్క రూపాయి ప్లాన్ మ్యాజిక్?

చాలామందికి సెకండ్ సిమ్ కార్డ్ మెయింటెన్ చేయడం అంటే భారంగా అనిపిస్తుంది. అలాంటి వారి కోసమే బిఎస్ఎన్ఎల్ ఈ ఫ్రీడం ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద మీరు కొత్త సిమ్ కార్డ్ తీసుకుంటే, కేవలం రూ.1 చెల్లిస్తే చాలు.. మీకు 30 రోజుల పాటు వ్యాలిడిటీ లభిస్తుంది. సాధారణంగా కొత్త సిమ్ తీసుకోవాలంటే కనీసం 200 నుంచి 300 రూపాయల రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.. కానీ ఇక్కడ కేవలం ఒక్క రూపాయికే మొత్తం సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.

బెనిఫిట్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

రూపాయి ప్లాన్ కదా అని తక్కువ అంచనా వేయకండి. ఇందులో రోజుకు 2GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. అంటే నెలకు మొత్తం 60GB అన్నమాట. దీనితో మీరు యూట్యూబ్ వీడియోలు చూడొచ్చు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడొచ్చు. డేటాతో పాటు ఇండియాలో ఏ నెట్‌వర్క్ కైనా అపరిమిత వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితం. ఇవన్నీ కేవలం ఒక్క రూపాయి ధరకే అంటే నిజంగా నమ్మశక్యంగా లేదు కదూ!

ఎవరికి ఉపయోగం? ఎప్పటి వరకు ఉంటుంది?

ముఖ్యంగా కొత్తగా బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ను ట్రై చేయాలనుకునే వారికి, స్టూడెంట్లకు మరియు తక్కువ ఖర్చుతో మొబైల్ వాడాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ యాక్టివేట్ చేసిన తేదీ నుండి ఈ 30 రోజుల గడువు మొదలవుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ స్పెషల్ ఆఫర్ ఏప్రిల్ 30, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే కంపెనీ ఈ ప్లాన్‌ను ఎప్పుడైనా మార్చే అవకాశం ఉంది కాబట్టి త్వరపడటం మంచిది.

ఎలా పొందాలి?

మీ దగ్గరలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లేదా రిటైల్ షాపుకు వెళ్లి కొత్త సిమ్ తీసుకోవడం ద్వారా ఈ ఫ్రీడం ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. పాత కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తించదు, కేవలం కొత్త కనెక్షన్ తీసుకునే వారికి మాత్రమే ఈ ఒక్క రూపాయి మ్యాజిక్ పనిచేస్తుంది. బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించడానికి, చౌకగా డేటా పొందడానికి ఇదొక అద్భుతమైన మార్గం.

PolitEnt Media

PolitEnt Media

Next Story