Cheapest Alcohol : మందుబాబులకు కిక్కెక్కించే న్యూస్..ఫుల్ బాటిల్ కేవలం రూ.35..ఎక్కడో తెలుసా ?
ఫుల్ బాటిల్ కేవలం రూ.35..ఎక్కడో తెలుసా ?

Cheapest Alcohol : మద్యం తాగేవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మన దేశంలో కూడా చాలామందికి మద్యం అంటే ఇష్టం. కానీ ఇక్కడ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా మందికి ఇబ్బంది కలిగిస్తుంది. అయితే కొన్ని దేశాలు ఉన్నాయి.. అక్కడ మద్యం ధరలు వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఒకచోటైతే ఒక బాటిల్ మద్యం కేవలం రూ.35కే దొరుకుతుంది. ఆ దేశాలు ఏవి, ధరలు ఎందుకు అంత తక్కువగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చౌకైన మద్యం దొరికే దేశాల జాబితాలో వియత్నాం మొదటి స్థానంలో ఉంది. మీడియా కథనాల ప్రకారం.. వియత్నాంలో ఒక బాటిల్ మద్యం ధర కేవలం రూ.35 మాత్రమే. దీని తరువాత ఉక్రెయిన్ లో మద్యం చాలా చౌకగా లభిస్తుంది. ఇక్కడ ఒక బాటిల్ ధర సుమారు రూ.45 ఉంటుంది. ఆఫ్రికా దేశమైన జాంబియా కూడా చౌకైన జాబితాలో ఉంది. జాంబియాలో ఒక బాటిల్ మద్యం ధర సుమారు రూ.75 పలుకుతుంది. అంటే, ఈ దేశాలలో మద్యం ధరలు భారతీయ రూపాయి విలువ ప్రకారం చాలా చాలా తక్కువగా ఉన్నాయి.
ఉక్రెయిన్, వెనిజులా, పోర్చుగల్‌లలో మద్యం ధరలు ఇంత తక్కువగా ఉండటానికి బలమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయా దేశాలలో ప్రభుత్వం మద్యంపై విధించే ట్యాక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మద్యం తయారు చేయడానికి అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉండటం మరొక ముఖ్య కారణం. ఇక చౌకగా దొరికే అంతర్జాతీయ బ్రాండ్లలో ప్రిన్స్ ఇగోర్ ఎక్స్‌ట్రీమ్ వోడ్కా, మోల్సన్ కెనడియన్ వంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి.
భారతదేశంలో మద్యం ధరలు ఒక రాష్ట్రంలో ఒకలా ఉంటాయి. ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ డ్యూటీ ఎంత విధించాలో వారే నిర్ణయిస్తారు. అయితే చౌకైన మద్యం దొరికే రాష్ట్రంగా గోవా చాలా ప్రసిద్ధి చెందింది. గోవాలో పర్యాటకాన్ని పెంచడానికి అక్కడి ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని చాలా తక్కువగా ఉంచుతుంది. అందుకే అక్కడ ధరలు తక్కువగా ఉంటాయి. గోవాతో పాటు, పర్యాటక ప్రాంతాలైన సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, లడఖ్ లలో కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మద్యం ధరలు చాలా తక్కువగా ఉంటాయి.

