November Deadline : కేవలం 3 రోజులే..నవంబర్ 30 లోపు ఈ 3 పనులు పూర్తి చేయండి
నవంబర్ 30 లోపు ఈ 3 పనులు పూర్తి చేయండి

November Deadline : నవంబర్ నెల ముగింపుకు వచ్చేసింది. ఈ నెల చివరితో పాటు అనేక ముఖ్యమైన ఆర్థిక, బ్యాంకింగ్ పనుల గడువు కూడా ముగుస్తుంది. ముఖ్యంగా నవంబర్ 30వ తేదీ లోపు మూడు ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటిని ఆలస్యం చేస్తే పెన్షన్ నిలిచిపోవడం లేదా బ్యాంక్ అకౌంట్‌తో లావాదేవీలు ఆగిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.
భారతదేశంలోని అన్ని పెన్షన్లు తీసుకునేవారు.. ప్రతీ సంవత్సరం నవంబర్ 30వ తేదీ లోపు తమ లైఫ్ సర్టిఫికెట్ లేదా జీవన్ ప్రమాణ పత్రాన్ని సంబంధిత పెన్షన్ ఏజెన్సీలకు తప్పనిసరిగా సమర్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు నేరుగా అధికారులను కలిసి లేదా ఇప్పుడు అందుబాటులో ఉన్న డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పద్ధతి ద్వారా సమర్పించవచ్చు. మీరు నవంబర్ 30 లోపు ఇది సమర్పించకపోతే మీ పెన్షన్ ఆగిపోతుంది. ఆలస్యంగా సమర్పించినా ఆ సర్టిఫికెట్‌ను సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్ ఆమోదించిన తర్వాతే మీకు నిలిచిపోయిన పెన్షన్ తిరిగి వస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు తమ KYC వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 30, 2025 వరకు గడువు ఉంది. మీరు ఈ లోగా KYC అప్‌డేట్ చేసుకోకపోతే, మీ బ్యాంక్ ఖాతాపై లావాదేవీలు చేసేందుకు నిబంధనలు విధించే లేదా పూర్తిగా అకౌంట్‌ను ఫ్రీజ్ చేసే ప్రమాదం ఉంటుంది. విత్‌డ్రాల్స్, ట్రాన్స్‌ఫర్‌లు వంటి సేవలకు అంతరాయం కలుగుతుంది.
KYC అప్‌డేట్ చేయడం చాలా సులభం
* ఆన్‌లైన్ ద్వారా: PNB ONE మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, లేదా వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు.
* ఆఫ్‌లైన్ ద్వారా: మీ సమీపంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కూడా KYC అప్‌డేట్ చేయవచ్చు.
* KYC అప్‌డేట్ అనేది మోసాలను నిరోధించడానికి, మీ గుర్తింపును ధృవీకరించడానికి చాలా అవసరం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో ముఖ్యమైన గడువు నవంబర్ 30, 2025. నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) నుంచి కొత్తగా ప్రారంభించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(UPS)కు మారడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది చివరి అవకాశం కావచ్చు. మొదట్లో ఈ గడువు జూన్ 30 నుంచి 30 వరకు పొడిగించారు. ఇప్పుడు అది నవంబర్ 30 వరకు పెంచారు. ఈ నిర్ణయం ఉద్యోగుల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. UPS లో రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన, ఖచ్చితమైన ఆదాయం లభిస్తుంది కాబట్టి, చాలా మంది ఉద్యోగులు UPSను ఎంచుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. నవంబర్ 30 లోపు మీరు మారడానికి అంగీకరించకపోతే, మీరు డిఫాల్ట్‌గా ప్రస్తుత NPS విధానంలోనే కొనసాగుతారు.

