భారీగా సంపాదిస్తున్న కెప్టెన్ కూల్ ధోనీ

Mahendra Singh Dhoni : దేశం గర్వించదగ్గ అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోని, ఇప్పుడు దేశంలోని అత్యంత ధనిక ఆటగాళ్ల జాబితాలో కూడా చేరిపోయాడు. అతని మొత్తం సంపద ఇప్పుడు రూ.1040 కోట్లకు పైగా చేరుకుంది. ఈ మొత్తం ఆదాయం కేవలం క్రికెట్ నుంచే తనకు రాలేదు. ధోనికి చాలా మార్గాల నుంచి ఆదాయం వస్తుంది. వ్యవసాయం, వ్యాపారం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు , పెట్టుబడులు వంటి అనేక రంగాలలో ధోని ఉన్నాడు. మైదానం వెలుపల కూడా తనో సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ అని చెప్పొచ్చు.

ధోనికి వ్యవసాయం పట్ల అమితమైన ఆసక్తి ఉంది. అతను తన సొంత పట్టణం రాంచీలో సేంద్రీయ వ్యవసాయం చేస్తాడు. స్ట్రాబెర్రీలు, పుచ్చకాయలు, కూరగాయలు, పువ్వులు పండిస్తాడు. అతని వ్యవసాయం పరిధి ఇప్పుడు ఎంతగా పెరిగిందంటే, దేశంలోని అనేక ప్రాంతాలకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాడు.

అలాగే'సెవెన్' పేరుతో ధోనికి సొంతంగా ఒక స్పోర్ట్స్ అపెరల్ బ్రాండ్ ఉంది. దీనికి అతనే బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నాడు. ఈ బ్రాండ్ షూలు, బట్టలు, స్పోర్ట్స్‌వేర్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. ధోని హోటల్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టాడు. రాంచీలో ఉన్న అతని హోటల్ 'మహి రెసిడెన్సీ' సాధారణ ప్రజలలో కూడా బాగా పాపులారిటీ సంపాదించింది. ఇది ఫైవ్ స్టార్ హోటల్ కానప్పటికీ, ఎయిర్‌బిఎన్‌బి, ఓయో, మేక్‌మైట్రిప్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఈజీగా బుక్ చేసుకోవచ్చు.

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల వంటి టెక్ దిగ్గజాలతో కలిసి ధోని బెంగళూరులో ఎంఎస్ ధోని గ్లోబల్ స్కూల్ ను ప్రారంభించాడు. ఇది సీబీఎస్ఈ సిలబస్‌తో కూడిన ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇక్కడ ఆధునిక టెక్నాలజీ,నిపుణుల సహాయంతో విద్యను అందిస్తారు. ధోని 7 ఇంక్ బ్రూస్ అనే బెవరేజ్, చాక్లెట్ బ్రాండ్ కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. ధోని అనేక ప్రముఖ బ్రాండ్లతో టైఅప్ అయి ఉన్నాడు. వాటి ద్వారా కూడా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తాడు. మహేంద్ర సింగ్ ధోని భారతదేశం తరపున 90 టెస్ట్ మ్యాచ్‌లు, 350 వన్డేలు, 98 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. దీని ఆధారంగా, బీసీసీఐ నుండి అతనికి నెలకు రూ.70,000 పెన్షన్ లభిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story