Liquor Booking: ఢిల్లీలో మద్యం కొనుగోలు చేసే తీరు పూర్తిగా మారిపోయింది. రాజధానిలో మద్యం ప్రియుల సౌకర్యం కోసం ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి వైన్ షాపుల ముందు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. నగరంలోని మందుబాబులు ఇకపై ఇంటి వద్దే కూర్చుని తమకు నచ్చిన బ్రాండ్‌లను మొబైల్ యాప్ ద్వారా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి పారదర్శకతను పెంచేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఎలా పనిచేస్తుంది ఈ కొత్త విధానం?

ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రత్యేక యాప్ ద్వారా వినియోగదారులు ఆన్‌లైన్‌లోనే బ్రాండ్లు, వాటి ధరలను చెక్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన మంద్‌ను సెలెక్ట్ చేసుకుని ఆన్‌లైన్ పేమెంట్ చేయాలి. బుకింగ్ పూర్తయిన తర్వాత డిజిటల్ రసీదుతో పాటు ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ షాపునకు వెళ్లి క్యూఆర్ కోడ్ చూపించి కేటాయించిన సమయంలోగా మందును కలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ విధానంలో మద్యం నేరుగా ఇంటికి డెలివరీ చేయబడదు, కేవలం ఆన్‌లైన్ బుకింగ్ మాత్రమే ఉంటుంది.

48 గంటల్లో కలెక్షన్ నిబంధన

ఈ ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్‌లో కొన్ని కఠినమైన నిబంధనలు కూడా పెట్టారు. యాప్‌లో లిక్కర్ బుక్ చేసుకున్న తర్వాత సరిగ్గా 48 గంటల సమయం ఉంటుంది. ఆ నిర్దేశిత సమయలోపు సంబంధిత వైన్ షాపునకు వెళ్లి క్యూఆర్ కోడ్ చూపించి బాటిల్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత గడువులోగా షాపునకు వెళ్లి తీసుకోకపోతే ఆ ఆర్డర్ రద్దు అయ్యే అవకాశం ఉంది. అలాగే కొనుగోలు చేసేవారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు అర్హత కలిగి ఉండటం తప్పనిసరి.

ప్రభుత్వానికి పెరిగే ఆదాయం

సాధారణంగా పండగలు, రద్దీ సమయాల్లో లిక్కర్ షాపుల వద్ద తీవ్రమైన రద్దీ ఏర్పడుతుంది. ఈ కొత్త యాప్ అందుబాటులోకి రావడంతో షాపుల వద్ద తోపులాటలు, క్యూ లైన్ల బెడద పూర్తిగా తప్పుతుంది. అంతేకాకుండా నకిలీ మద్యం అమ్మట్లకు చెక్ పెట్టడంతో పాటు ప్రభుత్వానికి రావాల్సిన ఎక్సైజ్ రెవెన్యూ మరింత పారదర్శకంగా మారుతుంది. ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న లైసెన్స్డ్ షాపులన్నీ ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానం చేయబడ్డాయి.

Next Story