రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండుసార్లు వడ్డీ రేట్లను 0.50 శాతం తగ్గించడంతో బ్యాంకులు డిపాజిట్ల సేకరణ విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. 2024--25 బ్యాంకుల ఆర్థిక ఫలితాల ప్రకారం.. రుణాలతో పోలిస్తే డిపాజిట్లు బాగా తగ్గు ముఖం పట్టాయి. ప్రస్తుతం బ్యాంకుల వద్ద పుష్కలంగా నగదు ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఎలాంటి సమస్య లేదు. కానీ, భవిష్యత్తులో బ్యాంకులు నగదు కొరతను ఎదుర్కొనే పరిస్ధితులు ఏర్పడితే ఇబ్బందులు ఎదురవుతాయి. డిపాజిట్లు, రుణాల మధ్య అంతరం చాలా కాలంగా రూ.45-50 లక్షల కోట్ల వద్ద స్థిరంగా ఉందని ఆర్బీఐ డేటా పేర్కొంటున్నది. ఏప్రిల్ 18తో ముగిసిన పక్షం రోజుల్లో డిపాజిట్లు మొత్తం డిపాజిట్లు రూ.228.60 లక్షల కోట్లు కాగా.. రుణాలు రూ.181.86 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్ 4న ఇది వరుసగా డిపాజిట్లు రూ.231.14 లక్షల కోట్లు ఉండగా.. రుణాలు రూ.184 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. మార్చి 21తో ముగిసిన పక్షం రోజుల్లో డిపాజిట్లు రూ.225.74 లక్షల కోట్లు ఉండగా.. రుణాలు రూ.182.43 లక్షల కోట్లుగా ఉన్నాయి.జనవరి 24తో ముగిసిన పక్షం రోజుల్లో డిపాజిట్లు 221.28 లక్షల కోట్లు కాగా.. రుణాలు 178.74 లక్షల కోట్లుగా ఉన్నాయి. జనవరి 10 నాటికి డిపాజిట్లు 221.50 లక్షల కోట్లు ఉండగా.. రుణాలు 178 లక్షల కోట్లుగా ఉన్నాయి. గతేడాది డిసెంబర్ 27తో ముగిసిన పక్షం రోజుల్లో డిపాజిట్లు 220.63 లక్షల కోట్లు కాగా.. రుణాలు 177.42 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇక డిసెంబర్ నుంచి ఆర్బీఐ బ్యాంకుల్లో 8.57 లక్షల కోట్లు అందుబాటులో ఉంచింది.ఇక బ్యాంకుల వారీగా రుణాల పెరుగుదల, డిపాజిట్లను పరిశీలిస్తే.. ఎస్బీఐలో డిపాజిట్లు 9.47శాతం.. రుణాలు 12.03శాతం పెరిగాయి. కెనరా బ్యాంకులో డిపాజిట్లు 11శాతం.. రుణాలు 11.74శాతంగా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిట్లు 10.30శాతం, రుణాలు 12.80శాతం.. యూకో బ్యాంక్లో రుణాలు 11.56శాతం, రుణాలు 17.72శాతం.. ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్లో డిపాజిట్లు 9.11శాతం, రుణాలు 14.15శాతంగా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రుణాలు 13.44శాతం, రుణాలు 17.76శాతం, ఇండియన్ బ్యాంక్లో డిపాజిట్లు 7శాతం, రుణాలు 10శాతం, సెంట్రల్ బ్యాంక్లో డిపాజిట్లు 7.19శాతం, రుణాలు 15.24శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 10.56శాతం, రుణాలు 13.74శాతంగా ఉన్నాయి.

Updated On 23 May 2025 2:09 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story