ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఇది తెలుసుకోండి

ITR Filing : భారతదేశంలో పెళ్లి అనేది ఒక పండుగ కంటే తక్కువ కాదు. నిజానికి, ఒక పండుగ కంటే కూడా పెళ్లిళ్లు మరింత సందడిగా ఉంటాయి. చాలామంది తమ లెవల్ కు తగ్గట్టుగా పెళ్లిని గుర్తుండిపోయేలా చేయడానికి ప్రయత్నిస్తారు. పెళ్లిలో చాలా రకాల బహుమతులు కూడా వస్తుంటాయి. అయితే, పెళ్లిలో వచ్చిన క్యాష్ గిఫ్ట్‌లపై పన్ను నియమాలు ఎలా ఉంటాయో చాలామందికి తెలియదు. ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఈ నియమాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా పెళ్లిళ్లలో బహుమతులు ఇవ్వడం చాలా సాధారణం. ఈ బహుమతులు కొన్నిసార్లు చాలా ఖరీదైనవిగా కూడా ఉంటాయి. బహుమతిగా నగదు వచ్చినప్పుడు దాని గురించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వడం అవసరం. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ నగదు ఎక్కడ నుంచి వచ్చిందో, ఎవరు ఇచ్చారో కూడా తెలియజేయాలి. అయితే, ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం, పెళ్లిలో వచ్చిన బహుమతులపై ఎలాంటి పన్ను ఉండదు.

ఎలాంటి గిఫ్ట్‌లకు పన్ను ఉండదు?

పెళ్లి సందర్భంలో వచ్చిన బహుమతులే కాకుండా, ఇతర సందర్భాల్లో వచ్చిన బహుమతులకు కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, అవి తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా జీవిత భాగస్వామి ఇచ్చి ఉండాలి. ఒకవేళ మీ పెళ్లిలో మీకు రూ. 10 లక్షల వరకు నగదు బహుమతిగా వస్తే, ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 56 ప్రకారం ఆ మొత్తం పన్ను రహితం. ఇందులో బంధువుల నుండి అందుకున్న బహుమతులు, రూ. 50,000 వరకు బంధువులు కాని వారి నుండి వచ్చిన బహుమతులు, వారసత్వం ద్వారా లేదా వీలునామా ద్వారా వచ్చిన బహుమతులు ఉంటాయి. అలాగే, పెళ్లి సందర్భంలో నగదు, బంగారం, లేదా యూపీఐ/బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ల ద్వారా వచ్చిన బహుమతులకు పన్ను ఉండదు.

ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పనిసరిగా పేర్కొనాలి

నియమం ప్రకారం పెళ్లిలో వచ్చిన బహుమతులపై పన్ను లేనప్పటికీ, వాటిని మీ ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పనిసరిగా ప్రకటించాలి. పెళ్లి బహుమతులను ఆదాయంగా పరిగణిస్తారు. అందుకే, భార్యాభర్తలు ఐటీఆర్-2 లేదా ఐటీఆర్-3 ఫారమ్‌లలో (ఏది వర్తిస్తే అది) ఈ వివరాలను తెలియజేయడం తప్పనిసరి.

PolitEnt Media

PolitEnt Media

Next Story