iPhone 16 Pro : లక్షల్లో అమ్ముడయ్యే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ తయారీ ఖర్చు ఎంతో తెలుసా?
తయారీ ఖర్చు ఎంతో తెలుసా?

iPhone 16 Pro : ఆపిల్ కంపెనీ ఐఫోన్లను లక్షల రూపాయలకు అమ్ముతుంది కదా. కానీ, అసలు ఆ ఫోన్‌ను తయారు చేయడానికి నిజంగానే లక్షల్లో ఖర్చవుతుందా? అని చాలాసార్లు చాలా మంది మైండ్‌లో ఓ డౌట్ వస్తూ ఉంటుంది. పోయిన ఏడాది లాంచ్ అయిన ఐఫోన్ 16 సిరీస్‌లో చాలా ఖరీదైన మోడల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్. లక్షల్లో అమ్ముడయ్యే ఈ ఫోన్ అసలు ఎన్ని రూపాయలకు తయారవుతుంది? అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఫోన్‌ను తయారు చేయడానికి అయ్యే ఖర్చు, దాని అసలు ధరలో సగం కంటే కూడా తక్కువ అని తెలుసా.
ఖర్చు ఇంత తక్కువ అయినప్పుడు ఆపిల్ కంపెనీ మన దగ్గర రెండింతలు, అంతకంటే ఎక్కువ డబ్బులు ఎందుకు వసూలు చేస్తుందని తెలిసి షాక్ అవుతున్నారా. ఇవాళ మనం ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ తయారు చేయడానికి అయ్యే ఖర్చుగురించి మాట్లాడుకుందాం. నిజానికి, పోయిన ఏడాది ఈ ఫోన్ లాంచ్ అయిన కొద్ది రోజులకే ఒక రిపోర్ట్ వచ్చింది. అందులో ఫోన్ తయారీ ఖర్చు గురించి క్లియర్‌గా చెప్పారు.
మార్కెట్ రీసెర్చ్ సంస్థ టీడీ కోవెన్ ప్రకారం.. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ తయారు చేయడానికి అయ్యే మెటీరియల్స్ ఖర్చు కేవలం 485 డాలర్లు మాత్రమే. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.41,992 అన్నమాట. ఈ రిపోర్ట్‌లో ఇంకో విషయం కూడా చెప్పారు. ఇది ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తయారీ ఖర్చు అయిన 453 డాలర్ల (సుమారు రూ.39,222) కంటే కొంచెం ఎక్కువ అంట.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బీఓఎం (BOM) అంటే కేవలం ముడిసరుకు, వాటిని కలిపి అసెంబుల్ చేయడానికి అయ్యే ఖర్చు మాత్రమే. ఫోన్ ఫైనల్ ధరలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మార్కెటింగ్, లాజిస్టిక్స్ లాంటి ఖర్చులు కూడా కలుస్తాయి. ఇవి కూడా ఫోన్ ధరను పెంచుతాయి. ప్రస్తుతానికి, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 256 జీబీ మోడల్ రూ.1,32,900కు అమ్ముడవుతోంది.
రిపోర్ట్ ప్రకారం, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తో పోలిస్తే, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర పెరగడానికి కారణం ఇందులో వాడిన కొత్త హార్డ్‌వేర్ (పార్ట్స్) అంట. 16 ప్రో మ్యాక్స్‌లో డిస్ప్లే, వెనుక కెమెరా సిస్టమ్ – ఈ రెండు చాలా ఖరీదైన పార్ట్స్. వీటి ధర సుమారు రూ.6,700. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో ఇదే పార్ట్స్ ధర రూ.6,300, రూ.5,900 ఉండేది.
కొత్త LPDDR5X ర్యామ్ టెక్నాలజీ కూడా ఫోన్ మొత్తం ధరను పెంచింది. ఈ ర్యామ్ ధర రూ.1,400. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో పాత LPDDR5 ర్యామ్ ఉండేది, దాని ధర కేవలం రూ.1,000 మాత్రమే. వీటితో పాటు, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో ఉన్న ఏ18 ప్రో చిప్సెట్ ధర సుమారు రూ.3,400, స్టోరేజ్ ధర సుమారు రూ.1,900. రవాణా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లాంటి ఖర్చుల తర్వాత కూడా ఆపిల్ కంపెనీకి మంచి గ్రాస్ మార్జిన్ వస్తుంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రతీ మోడల్‌పై కంపెనీ మంచి ప్రాఫిట్ సంపాదిస్తుంది.
