Shivam Dube Net Worth : క్రికెట్ ప్రపంచంలో కొత్త కుబేరుడు.. శివమ్ దూబే ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
శివమ్ దూబే ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Shivam Dube Net Worth : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే తన పవర్ హిట్టింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో కేవలం 31 బంతుల్లోనే 66 పరుగులు చేయడమే కాకుండా, రెండు కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కేవలం మైదానంలోనే కాదు, సంపాదనలో కూడా దూబే ఇప్పుడు సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతున్నాడు. స్టార్ ప్లేయర్ల రేంజ్‌లో భారీగా ఆర్జిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
మీడియా కథనాల ప్రకారం.. 2025 నాటికి శివమ్ దూబే నికర ఆస్తి విలువ దాదాపు రూ.30 నుంచి 34 కోట్ల వరకు ఉంటుంది. కోహ్లీ, రోహిత్ వంటి టాప్ రిచ్ క్రికెటర్ల జాబితాలో లేకపోయినప్పటికీ, ప్రస్తుత తరం యువ ఆల్‌రౌండర్లలో అత్యధికంగా సంపాదిస్తున్న టాప్-15 ప్లేయర్లలో దూబే ఒకడిగా నిలిచాడు. ఐపీఎల్ ఫామ్ మరియు టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం అతని ఆర్థిక ఎదుగుదలకు ప్రధాన కారణమైంది.
బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా దూబే ఏడాదికి సుమారు రూ.5 నుంచి 6 కోట్ల వరకు ఆర్జిస్తున్నాడు. స్పోర్ట్స్, ఫ్యాషన్, ఫుడ్, టెక్నాలజీ విభాగాల్లోని దిగ్గజ సంస్థలతో అతను ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. పీటర్ ఇంగ్లాండ్, బిర్యానీ బై కిలో, మై ప్రోటీన్, ఫైర్-బోల్ట్ వంటి ప్రముఖ బ్రాండ్లకు దూబే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 22 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉండటంతో, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కూడా అతనికి భారీ డిమాండ్ ఉంది.
ఇక క్రికెట్ ద్వారా వచ్చే ఆదాయం విషయానికి వస్తే.. బీసీసీఐ గ్రేడ్-సి సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా ఏడాదికి రూ.కోటి వస్తుంది. టీ20 మ్యాచ్ ఆడితే రూ.3 లక్షల ఫీజు అదనం. అయితే, దూబే దశ తిరిగింది మాత్రం ఐపీఎల్‌లోనే. చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని రూ.12 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్ కంటే ఇది రూ.5 కోట్లు ఎక్కువ. డొమెస్టిక్ క్రికెట్, మ్యాచ్ ఫీజులు అన్నీ కలుపుకుంటే, కేవలం మైదానంలో ఆడుతూనే దూబే ఏడాదికి రూ.15 నుంచి 17 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు.

