ఈపీఎఫ్‌ఓ 3.0 తో రానున్న కొత్త ఫీచర్స్ ఇవే!

EPFO 3.0: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అయిన ఈపీఎఫ్‌ఓ (EPFO) తన ప్లాట్‌ఫారమ్‌ను మరోసారి అప్‌గ్రేడ్ చేసింది. త్వరలో కొత్త ఈపీఎఫ్‌ఓ 3.0 సిస్టమ్ అమలులోకి రానుంది. దీనితో పీఎఫ్ డబ్బుల నిర్వహణ మరింత సులభమవుతుంది. ఈ సేవలు వేగంగా, మరింత పారదర్శకంగా ఉంటాయి. భారతదేశంలోని ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ సహాయంతో ఈపీఎఫ్‌ఓ ప్లాట్‌ఫారమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నారు.

ఈపీఎఫ్‌ఓ 3.0 ప్రత్యేకతలు

వాస్తవానికి ఈపీఎఫ్‌ఓ 3.0 సిస్టమ్ 2025 జూన్‌లోనే అమలులోకి రావాల్సి ఉంది. అయితే, టెక్నికల్ టెస్టింగ్స్ జరుగుతున్నందున దాని అమలు ఆలస్యం అయింది. త్వరలోనే ఇది రోలౌట్ అవుతుందని ఆశిస్తున్నారు. ఈ ఈపీఎఫ్‌ఓ 3.0 సిస్టమ్‌లో ఉన్న ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం:

1. ఏటీఎంలలో క్యాష్ విత్‌డ్రా సౌకర్యం

పీఎఫ్ ఖాతాదారులు ఇకపై ఏటీఎంల నుండి నేరుగా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, పీఎఫ్ ఖాతాదారుల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివ్‌గా ఉండాలి. వారి బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. అయితే, ఎంత మొత్తం డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చనే వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఈ సదుపాయం అత్యవసర సమయాల్లో చాలా ఉపయోగపడుతుంది.

2. యూపీఐ ద్వారా డబ్బు బదిలీ

ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవడంతో పాటు, యూపీఐ ద్వారా కూడా పీఎఫ్ డబ్బును బదిలీ చేసుకోవచ్చు. ఇది లావాదేవీలను మరింత సులభతరం చేస్తుంది. ఖాతాదారులు తమ అవసరాలకు అనుగుణంగా త్వరగా డబ్బును బదిలీ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

3. ఆన్‌లైన్ క్లెయిమ్ ప్రక్రియ సరళం

ఈపీఎఫ్‌ఓ 3.0 వ్యవస్థలో పీఎఫ్ డబ్బు కోసం క్లెయిమ్ దాఖలు చేసే ప్రక్రియ మరింత సులభం అవుతుంది. ఆన్‌లైన్‌లో సులభంగా ఫారమ్‌లు నింపడం, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయడం వంటివి మరింత వేగంగా జరుగుతాయి.

4. డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ వేగం పెరుగుతుంది

పీఎఫ్ ఖాతాదారుడు మరణించినప్పుడు, అతని నామినీలు క్లెయిమ్ దాఖలు చేస్తే, దానిని త్వరితగతిన పరిష్కరించే వ్యవస్థను ఆశించవచ్చు. ఇప్పుడు డెత్ క్లెయిమ్ సందర్భంలో నామినీ మైనర్ అయితే గార్డియన్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. కానీ, కొత్త వ్యవస్థలో ఈ ప్రక్రియను తొలగించే అవకాశం ఉంది, దీనివల్ల క్లెయిమ్ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది.

5. మొబైల్ వినియోగదారులకు సులభం

స్మార్ట్‌ఫోన్‌లో ఈపీఎఫ్‌ఓ యాప్‌లు సులభంగా ఉపయోగించడానికి వీలుగా డిజైన్ చేయబడతాయి. పీఎఫ్ ఖాతాలను సులభంగా వీక్షించడానికి, క్లెయిమ్ చేయడానికి, ఇతర సేవలను పొందడానికి వీలుగా దీనిని రూపొందిస్తారు. ఇది మొబైల్ వినియోగదారులకు చాలా సౌలభ్యాన్ని అందిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story