ఇలా చేయండి

EPFO : మీరు ఉద్యోగం చేస్తున్నట్లు అయితే మీకు పీఎఫ్ ఖాతా ఉండే ఉంటుంది. ఆర్థిక సంవత్సరం 2024-25 కోసం 8.25శాతం వడ్డీ రేటును EPFO తన ఖాతాదారుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. అయితే, కొందరు ఖాతాదారులకు ఈ వడ్డీ డబ్బులు రావడానికి కొద్దిగా ఆలస్యం కావొచ్చు. కాబట్టి, మీ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో తప్పకుండా చెక్ చేసుకోండి. అవసరమైతే, తక్షణమే కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వడ్డీ జమ ఎందుకు ఆలస్యమవుతుంది?

ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రతి సంవత్సరం గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిపాజిట్ మొత్తంపై వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. అయితే, వడ్డీ రేటును ప్రకటించిన తర్వాత, ప్రతి ఖాతాకు సంబంధించిన పూర్తి వివరాలను లెక్కించి, వడ్డీని జమ చేయడానికి కొంత సమయం పడుతుంది. అందుకే ఈ ఆలస్యం జరుగుతుంది.

బ్యాంకుల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగా కాకుండా, ఈపీఎఫ్ వడ్డీ ప్రతి నెలా లెక్కించబడుతుంది. కానీ ఖాతాలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే జమ అవుతుంది. మీరు డబ్బును విత్‌డ్రా చేయనంతవరకు, పాస్‌బుక్‌లో అప్‌డేట్ ఆలస్యం అయినా మీకు ఎలాంటి నష్టం ఉండదు.

వడ్డీ జమ ఆలస్యమైతే ఏం చేయాలి?

మీ పాస్‌బుక్‌లో చాలా రోజులు ఎదురుచూసినా వడ్డీ అప్‌డేట్ కాకపోతే, ఈ కింది పనులు చేయండి:

* కేవైసి వివరాలు చెక్ చేయండి: ఈపీఎఫ్‌ఓ పోర్టల్ లో మీ ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా లింక్ అయ్యాయో లేదా వెరిఫై అయ్యాయో లేదో తనిఖీ చేసుకోండి.

* పాస్‌బుక్‌ను ఆన్‌లైన్‌లో చూడండి: ఈపీఎఫ్‌ఓ మెంబర్ పోర్టల్ లేదా ఉమంగ్ యాప్ ద్వారా మీ పాస్‌బుక్ తాజా వివరాలను చెక్ చేయండి.

* ఫిర్యాదు చేయండి : పైన చెప్పినవన్నీ సరిగ్గా ఉన్నా ఇంకా సమస్య ఉంటే, ఈపీఎఫ్‌ఐజీఎంఎస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదును నమోదు చేయండి.

* ఈపీఎఫ్‌ఓ ఆఫీసుకు వెళ్లండి: సమస్య అలాగే కొనసాగితే, మీ యూఏఎన్ నంబర్, గుర్తింపు కార్డు తీసుకుని దగ్గర్లోని ఈపీఎఫ్‌ఓ కార్యాలయాని వెళ్లి సహాయం పొందండి.

చాలా మంది ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీ కొద్ది రోజుల్లోనే అప్‌డేట్ అవుతుంది. ఎందుకంటే ఈపీఎఫ్‌ఓ జమ చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. మీ ఖాతాలో ఇంకా ఆలస్యం అవుతుంటే, పాస్‌బుక్‌ను గమనిస్తూ ఉండండి. అవసరమైతే మాత్రమే తగిన చర్యలు తీసుకోండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story