EPFO: దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులు అలాగే రిటైర్డ్ ఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే ఒక శుభవార్త అందే అవకాశం ఉంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పరిధిలోని ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద లభించే కనీస నెలవారీ పింఛను రూ.1,000 నుంచి రూ.3,000 వరకు పెంచే అంశంపై తీవ్రంగా చర్చిస్తున్నారు. దీనికి సంబంధించిన కీలక నిర్ణయం నవంబర్ 19, 2026 న కొత్తగూడెంలో జరగాల్సిన సమావేశం బదులుగా న్యూఢిల్లీలో జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) భేటీలో వెలువడే అవకాశం ఉంది.

నవంబర్ 19న న్యూఢిల్లీలో సీబీటీ కీలక సమావేశం

ఈపీఎఫ్‌వో ప్రాంతీయ భవిష్యండ్ నిధి కమిషనర్ సుబ్రత్ భౌమిక్ ఇటీవల సీబీటీ సభ్యులకు పంపిన లేఖ ప్రకారం.. నవంబర్ 19, 2026 ఉదయం 10:15 గంటలకు ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కనీస పెన్షన్ పెంపునకు సంబంధించిన ప్రతిపాదనపై ప్రధానంగా చర్చిస్తారు. అయితే ఈ మార్పులపై శ్రమ మంత్రిత్వ శాఖ అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిని ఒక సంభావ్య ప్రతిపాదనగానే చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.

2014 నుంచి మారని కనీస పింఛను మొత్తం

ఈపీఎస్ కింద ప్రస్తుతం అందుతున్న కనీస పింఛను చివరిసారిగా ఫిబ్రవరి 2014లో సవరించి రూ.1,000 చేశారు. ఆ తర్వాత ద్రవ్యోల్బణం ఎంత పెరిగినప్పటికీ పెన్షన్ మొత్తంలో ఎలాంటి మార్పు జరగలేదు. ప్రస్తుత కాలంలో వెయ్యి రూపాయలతో కుటుంబ పోషణ సాధ్యం కాదని కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో ఆందోళనలు చేస్తున్నాయి. కనీస పింఛను మొత్తాన్ని కనీసం రూ.7,500 చేయాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో ప్రభుత్వం దీనిని రూ.3,000 వరకు పెంచే ఆలోచన చేయడం గమనార్హం.

వేతన పరిమితి పెంపుతో మరింత డిమాండ్

ఉద్యోగుల పెన్షన్ లెక్కింపునకు ప్రాతిపదికగా ఉండే గరిష్ట వేతన పరిమితిని ప్రభుత్వం గతంలోనే రూ.25,000కు పెంచింది. ఈ పరిమితి పెరిగిన తర్వాత కార్మిక వర్గాల నుంచి కనీస పింఛను పెంచాలనే డిమాండ్ మరింత ఊపందుకుంది. కంపెనీలు ఉద్యోగి బేసిక్ వేతనంలో 8.33 శాతం మొత్తాన్ని పెన్షన్ నిధికి జమ చేస్తుంటాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన ఈపీఎస్ 2026 నిబంధనల ప్రకారం వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Next Story