EPFO : దేశంలోని కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించింది. పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా, తమ సేవలను మరింత సులభతరం చేస్తూ సరికొత్త వాట్సాప్ ఆధారిత ఏఐ చాట్‌బాట్ వేదికను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై ఉద్యోగులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి ఈపీఎఫ్ఓ అధికారిక వాట్సాప్ నంబర్‌కు జస్ట్ Hello అని మెసేజ్ పంపితే చాలు.. స్థానిక భాషల్లోనే (తెలుగుతో సహా) పూర్తి మెనూ ఓపెన్ అవుతుంది. దీని ద్వారా 24x7 గంటల పాటు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, చివరి 5 ట్రాన్సాక్షన్ల వివరాలు, క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవడం వంటి పనులను క్షణాల్లో పూర్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా పీఎంవీబీఆర్‌వై కింద పెండింగ్‌లో ఉన్న కేసులు, అలాగే ఇతర గుర్తింపు కార్డుల లింకింగ్ సమస్యలను కూడా ఈ వాట్సాప్ వేదిక ద్వారానే పరిష్కరించనున్నారు.

ఈపీఎఫ్ఓ 3.0 డిజిటల్ విప్లవం..

ఈపీఎఫ్ఓ 3.0 ప్రాజెక్ట్‌లో భాగంగా సంస్థ తన సేవలను శరవేగంగా డిజిటలైజ్ చేస్తోంది. రాబోయే రోజుల్లో యూపీఐ, ఏటీఎంల ద్వారా కూడా పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకునే సరికొత్త సాంకేతికతపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే ఉద్యోగులకు మరో లడ్డూ లాంటి వార్త కూడా వినబడుతోంది. ప్రస్తుతం ఇస్తున్న కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.1,000 నుంచి ఏకంగా రూ.3,000కి పెంచాలని ఈపీఎఫ్ఓ యోచిస్తున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంటే కోట్ల మంది పెన్షనర్లకు పెద్ద ఉపశమనం లభించనుంది. ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్, ఫాస్ట్ ప్రాసెసింగ్ వంటి సదుపాయాల వల్ల ఇకపై చిన్న పట్టణాలు, దూరప్రాంతాల్లో ఉండే ఉద్యోగులకు పీఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరిగే తిప్పలు శాశ్వతంగా తప్పనున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story