FASTag : ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ కు సూపర్ రెస్పాన్స్.. 4 రోజుల్లోనే 5 లక్షల మంది యూజర్లు
4 రోజుల్లోనే 5 లక్షల మంది యూజర్లు

FASTag : 2025 ఆగస్టు 15న లాంచ్ అయిన ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ కు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. కేవలం 4 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా ఈ పాస్‌ను కొనుగోలు చేశారు. అత్యధిక పాస్‌లు కొనుగోలు చేసిన రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత కర్ణాటక, హర్యానా ఉన్నాయి. అలాగే, టోల్ ప్లాజాల వద్ద అత్యధిక లావాదేవీలు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో నమోదయ్యాయి.
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ తో పాటుగా, రాజ్‌మార్గ్ యాత్ర యాప్ కూడా పెద్ద విజయం సాధించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ మొత్తం ర్యాంకింగ్‌లో 23వ స్థానానికి, ట్రావెల్ కేటగిరీలో రెండో స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఈ యాప్‌ను 15 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీనికి 4.5 స్టార్ రేటింగ్ లభించింది. లాంచ్ అయిన కేవలం 4 రోజుల్లోనే ఇది దేశంలో టాప్ ప్రభుత్వ యాప్‌గా నిలిచింది.
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ప్రత్యేకతలు
రూ.3000 చెల్లిస్తే ఒక సంవత్సరం (లేదా 200 టోల్ ట్రావెల్స్) వరకు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా సుమారు 1,150 టోల్ ప్లాజాలలో ఈ పాస్ చెల్లుతుంది. పాస్ కొనుగోలు చేసిన రెండు గంటల్లోపు అది యాక్టివేట్ అవుతుంది. ఈ పాస్‌ను రాజ్‌మార్గ్ యాత్ర యాప్ లేదా ఎన్‌హెచ్‌ఏఐ వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.
