ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే నష్టపోతారు

FASTag Yearly Pass : ఫాస్టాగ్‌ వార్షిక పాస్ అనేది ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ అందించే ఒక ప్రత్యేక సేవ. ఇది ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్‌ల కోసం మాత్రమే ప్రారంభించబడింది. ఈ పాస్ ద్వారా నేషనల్ హైవే, నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వే పై టోల్ ప్లాజాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా దాటవచ్చు. ఈ పాస్ ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్‌ల వరకు (ఏది ముందుగా పూర్తయితే అది) చెల్లుబాటులో ఉంటుంది. దీని అర్థం, మీరు ఒక సంవత్సరం పాటు టోల్-ఫ్రీ ప్రయాణం చేయవచ్చు లేదా 200 ట్రిప్‌లు చేయవచ్చు. అయితే, ఈ పాస్ కోసం ఒకేసారి రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రూ.3,000 పెట్టి వార్షిక ఫాస్టాగ్‌ పాస్ తీసుకోవడం లాభదాయకమా కాదా అనే సందేహం చాలామందిలో ఉంది.

ఫాస్టాగ్‌ వార్షిక పాస్ వల్ల కలిగే లాభాలు

ఫాస్టాగ్‌ వార్షిక పాస్ తీసుకున్న తర్వాత పదే పదే టోల్ చెల్లింపుల చిక్కులు ఉండవు. ప్రతిసారీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు క్యాష్‌లెస్, ఆటోమేటిక్ ఎంట్రీతో పొడవైన క్యూలలో వేచి ఉండాల్సిన పని ఉండదు. మీరు ప్రతిరోజు లేదా ఎక్కువ ప్రయాణాలు చేసే వారైతే, సంవత్సరం మొత్తం ఖర్చు ముందుగానే నిర్ణయించుకోవచ్చు. రోజు ఆఫీసుకు వెళ్లేవారు లేదా హైవేపై ఎక్కువగా ప్రయాణించే వారికి ఇది లాభదాయకమైనదిగా నిరూపించబడుతుంది.

ఫాస్టాగ్‌ వార్షిక పాస్ వల్ల కలిగే నష్టాలు

తక్కువ ప్రయాణాలు చేసే వారికి ఇది నష్టదాయకం. మీరు నెలలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే టోల్ ప్లాజాను దాటితే, రూ.3,000 వృధా కావచ్చు. ఇది నాన్-రిఫండబుల్ మొత్తం. ఒకసారి వార్షిక పాస్ తీసుకున్న తర్వాత డబ్బు తిరిగి రాదు. ఈ పాస్ అన్ని చోట్ల చెల్లుబాటు కాదు.. మీరు ఎక్కడ కొనుగోలు చేశారో ఆ టోల్ ప్లాజా లేదా హైవేపై మాత్రమే చెల్లుబాటు అవుతుంది. దీనికి పరిమిత చెల్లుబాటు ఉంటుంది. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత మీరు మళ్లీ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

ఫాస్టాగ్‌ వార్షిక పాస్ ఎక్కడ కొనాలి?

ఈ పాస్‌ను ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఎన్‌హెచ్ఏఐ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయండి. మొదట, మీ వాహనం ఈ పాస్ కోసం చెల్లుబాటు అవుతుందా లేదా అని తనిఖీ చేస్తారు. మీ ఫాస్టాగ్‌ చెల్లుబాటును చూస్తారు. ఆ తర్వాత రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపు చేసిన సుమారు 2 గంటల్లో మీ పాస్ యాక్టివేట్ అవుతుంది.

కొత్త ఫాస్టాగ్‌ అవసరమా?

కొత్త ఫాస్టాగ్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాత ఫాస్టాగ్‌పైనే పాస్ యాక్టివేట్ అవుతుంది. కానీ అది తప్పనిసరిగా యాక్టివ్ స్థితిలో ఉండాలి. ఫాస్టాగ్‌ మీ వాహనం విండ్‌స్క్రీన్‌పై సరిగ్గా అతికించి ఉండాలి. మీ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ తో అనుసంధానించబడి ఉండాలి. బ్లాక్‌లిస్ట్ చేయబడి ఉండకూడదు. ఒకవేళ మీరు ఫాస్టాగ్‌ను చేతిలో పెట్టుకున్నా, సరిగా అతికించకపోయినా లేదా తప్పుగా అమర్చినా, పాస్ చెల్లుబాటు కాదు. ఫాస్టాగ్‌ వార్షిక పాస్ తరచుగా హైవేపై ప్రయాణించే వారికి మంచి ఎంపిక. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, టోల్ వద్ద ఉండే ఇబ్బందుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story