ITR Filing : 2026 సంవత్సరానికి సంబంధించి ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు చేయడానికి ఆఖరి తేదీ దగ్గరపడుతోంది. రిటర్న్స్ దాఖలు చేయడానికి ఇంక కేవలం 4 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటివరకు ఐటీఆర్ ఫైల్ చేయని ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులకు ఒక ఉపయోగకరమైన శుభవార్త అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఐటీఆర్ దాఖలు చేయడానికి చార్టర్డ్ అకౌంటెంట్లు లేదా టాక్స్ నిపుణుల వద్దకు వెళ్లి వేలకు వేలు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. పేటీఎం సంస్థ క్లియర్ టాక్స్ భాగస్వామ్యంతో అతి తక్కువ ధరకు, అంటే కేవలం 11 రూపాయల ప్రారంభ రుసుముతోనే ఐటీఆర్ ఫైల్ చేసే సౌకర్యాన్ని తీసుకువచ్చింది.

రూ.11 ప్లాన్‌లో లభించే ప్రత్యేక సౌకర్యాలు

ఈ ప్రత్యేక ఫీచర్ పన్ను చెల్లింపుదారులకు నేరుగా Paytm యాప్‌లోని Free Tools సెక్షన్‌లో లభిస్తుంది. ఈ విధానంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఫారమ్ నింపేందుకు వినియోగదారులు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం ఉండదు. ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న మీ వ్యక్తిగత, ఆదాయ వివరాలు ఫారమ్‌లో ఆటోమేటిక్‌గా నమోదు అవుతాయి. వినియోగదారుల ఆదాయ వనరులను విశ్లేషించి, వారికి ఏ ఫారమ్ (ITR-1, ITR-2 మొదలైనవి) సరిపోతుందో, అలాగే కొత్త లేదా పాత పన్ను విధానాల్లో ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉందో ఈ సిస్టమ్ ఆటోమేటిక్ గా సూచిస్తుంది.

స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు ఊరట

మీరు షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారైతే ఈ ప్లాట్‌ఫారమ్ మీకు ఎంతగానో ఉపకరిస్తుంది. దాదాపు 80కి పైగా ప్రముఖ స్టాక్ బ్రోకర్ల నుండి డేటాను కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో ఇది ఇంపోర్ట్ చేసుకుంటుంది. దీనివల్ల మీ క్యాపిటల్ గెయిన్స్ (లాభాలు లేదా నష్టాలు) లెక్కలను స్వయంగా చేయాల్సిన తిప్పలు తప్పుతాయి. అంతేకాకుండా, ఈ రూ.11 ప్లాన్‌లో ఉచిత నోటీస్ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఏవైనా నోటీసులు వస్తే ఆ నోటీసులను విశ్లేషించి సమాధానం ఇవ్వడంలో క్లియర్ టాక్స్ బృందం పూర్తి సహాయం అందిస్తుంది.

సబ్మిట్ చేసే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఫారమ్-16 ద్వారా పన్ను మినహాయింపు పొందే ఉద్యోగులకు, బ్యాంక్ వడ్డీ ఆదాయం మాత్రమే ఉన్నవారికి ఈ ఆఫర్ చాలా బెస్ట్ ఆప్షన్. అయితే కేవలం టెక్నాలజీపైనే పూర్తి నమ్మకం ఉంచడం సరికాదని పన్ను నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాప్ మీ వివరాలను ఆటోమేటిక్‌గా పూరించినప్పటికీ, ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు ప్రతీ ఒక్కరు తమ సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. మీ ఆదాయ వివరాలు, లభించే పన్ను మినహాయింపులు సరిగ్గా నమోదయ్యాయో లేదో చెక్ చేసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా ఒకరి కంటే ఎక్కువ యజమానుల వద్ద పనిచేసినా, ఇంటి అద్దె ఆదాయం లేదా ఫ్రీలాన్సింగ్ ద్వారా ఆదాయం పొందుతున్నా మరింత జాగ్రత్తగా పరిశీలించి సమర్పించాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story