Mega Sales: దేశంలో పండుగ సీజన్ అధికారికంగా వచ్చేయడంతో ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు ఏడాదిలోకెల్లా అత్యంత భారీ సేల్స్‌కు సర్వం సిద్ధం చేశాయి. కొత్త స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు లేదా గృహోపకరణాలు ఏవి కొనాలన్నా ఇదే సరైన సమయంగా నిలుస్తోంది. కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకునేందుకు ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లు బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాలు, భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ప్రకటించాయి. దీంతో టెక్ లవర్స్ ఈ సేల్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

సేల్స్ ప్రారంభ తేదీలు, ఎర్లీ యాక్సెస్ విశేషాలు

అమెజాన్ తన ప్రతిష్టాత్మక గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్‌ను అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభించనుంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్‌ను అక్టోబర్ 9 నుంచి అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్, క్రెడిట్ కార్డ్ యూజర్లకు మాత్రం అక్టోబర్ 8 నుంచే ఎర్లీ యాక్సెస్ లభించనుంది. అంతేకాకుండా సెప్టెంబర్ 24 నుంచే ఎర్లీ బర్డ్ డీల్స్ కూడా ప్రారంభం కానుండటంతో వినియోగదారులు తమకు నచ్చిన ప్రొడక్ట్స్‌ను ముందుగానే విష్‌లిస్ట్‌లో యాడ్ చేసుకునే వెసులుబాటు దొరుకుతుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో లభించే అదిరిపోయే డిస్కౌంట్లు

ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసేవారికి ఆఫర్ల వర్షం కురవనుంది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్‌పై 10 శాతం వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే సూపర్.మనీ ద్వారా పేమెంట్ చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. క్యాష్ సమస్య ఉన్నవారికి ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా ఏకంగా రూ. లక్ష వరకు క్రెడిట్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇక ప్రైజ్ విషయానికి వస్తే.. ఐఫోన్ 17 కేవలం రూ.80,000 కన్నా తక్కువ ఎఫెక్టివ్ ధరకు లభించే అవకాశం ఉంది. అలాగే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25, వివో, రియల్‌మీ, మోటోరోలా వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు ఉండనున్నాయి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రత్యేకతలు

అమెజాన్ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్లకు 10 శాతం ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రైమ్ మెంబర్లకు ప్రత్యేకంగా అదనపు ప్రయోజనాలు దక్కనున్నాయి. కస్టమర్ల సౌలభ్యం కోసం బ్లాక్‌బస్టర్ డీల్స్, టాప్ 100 డీల్స్, మెగా డీల్స్, ప్రతిరోజూ రాత్రి వచ్చే 8 PM డీల్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పాత సామాగ్రిని మార్చుకోవడానికి ఎక్స్ఛేంజ్ మేళా, బై మోర్ సేవ్ మోర్ వంటి ఆకర్షణీయమైన స్కీమ్‌లతో అన్ని రకాల ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలను అత్యంత తక్కువ ధరలకు కొనుగోలు చేసే అద్భుతమైన అవకాశం లభిస్తోంది.

Next Story